అంతఃపురంలో చంద్రముఖి ఆనంద తాండవం..ఫస్ట్ సింగిల్ ఇదిగో, మైమరపిస్తున్న కీరవాణి సంగీతం

Published : Aug 11, 2023, 07:15 PM IST
అంతఃపురంలో చంద్రముఖి ఆనంద తాండవం..ఫస్ట్ సింగిల్ ఇదిగో, మైమరపిస్తున్న కీరవాణి సంగీతం

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం చంద్రముఖి అప్పట్లో ఒక సంచలనం.ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా.. జ్యోతిక టైటిల్ రోల్ పోషించిన చిత్రం చంద్రముఖి అప్పట్లో ఒక సంచలనం. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం కథా బలం, రజనీకాంత్ స్టార్ పవర్, జ్యోతిక నటనతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 వస్తోంది. అయితే సీక్వెల్ లో రజనీ నటించడం లేదు. రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 

ఇక చంద్రముఖి పాత్రలో లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. అప్పుడే కంగనా జ్యోతిక స్థాయిలో మెప్పిస్తుందనే పోలికలు కూడా మొదలైపోయాయి. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

స్వాగతాంజలి అంటూ సాగే ఈ పాట మైమరపించే విధంగా ఉంది. కీరవాణి తన అనుభవాన్ని జోడించి ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఈ సాంగ్ లో టైటిల్ రోల్ పోషిస్తున్న కంగనా రనౌత్ అంతఃపురంలో చెలికత్తెలతో నాట్యం చేస్తోంది.  కంగనా రనౌత్ ఆభరణాలు ధరించి రాజనర్తకి చంద్రముఖిలా డాన్స్ చేయటాన్ని చూడొచ్చు.   

ఇక సినిమా కోసం వేసిన సెట్స్, కంగనా రనౌత్, రాఘవ లారెన్స్ కాస్ట్యూమ్స్ వావ్ అనిపిస్తున్నాయి.శ్రీనిధి తిరుమ‌ల పాడిన ఈ పాట‌ను చైత‌న్య ప్రసాద్ రాశారు. ఈ మూవీకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత తోట త‌ర‌ణి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆంథోని ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. అక్కడక్కడా ఈ సాంగ్ లో మొదటి భాగంలోని వారాయ్ సాంగ్ ఛాయలు కనిపించాయి. ఇక రాఘవ లారెన్స్ యువరాజుగా శత్రువులని వెంటాడుతూ దూసుకువస్తున్నాడు. చూస్తుంటే లారెన్స్, కంగనా ఇద్దరూ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే