కాపులను బీసీల్లో చేర్చలేరని ఆ రోజు తెలియదా-పవన్ కల్యాణ్

First Published Mar 14, 2018, 7:56 PM IST
Highlights
  • కాపులను బీసీల్లో చేర్చలేరని ఆ రోజు తెలియదా-పవన్ కల్యాణ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పలు అంశాలను స్పృశించిన పవన్ కల్యాణ్... కులాల మధ్య ఐక్యత సాధించేందుకు జనసేన శాయశక్తులా పనిచేస్తుందన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కుల రాజకీయాలు చేయబోమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

తనకు తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు కుల రాజకీయం చేశారు. మత్సకారులను ఎస్సీల్లో ఎలా చేరుస్తారో.. హామీ ఎలా ఇచ్చారో అర్ధం కాదు. ఇక కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చారు. అది ఎలా సాధ్యమవుతుందో అన్నది ఆలోచించే ఆ హామీ ఇచ్చారా. అసలు కాపుల రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి కూడా.. కాపులను బీసీల్లో చేరుస్తామని కులరాజకీయం చేసింది బాబు కాదా అంటూ వ్యాఖ్యానించారు పవన్. అలాగా నేను మిమ్మల్ని మోసం చేయనని, బీజేపీతో వెళ్లింది ముస్లింలను దూరం చేసుకోవటానికి కాదు.. ఆ రోజు అది రైటనిపించింది. అందుకే వెళ్లా.

కొందరు వైసీపీ నేతలు నన్ను అంటున్నారు. నేను చంద్రబాబు డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్నానని. ఇప్పుడు చెప్పండి. నేను బాబు డైరెక్షన్ లో పని చేస్తున్నానా అని వైసీపీ నేతలను అడుగుతున్నాను అని పవన్ అన్నారు.

click me!