మెగాస్టార్ కి చంద్రబాబు స్పెషల్ విషెస్

Published : Aug 22, 2019, 12:28 PM ISTUpdated : Aug 22, 2019, 12:31 PM IST
మెగాస్టార్ కి చంద్రబాబు స్పెషల్ విషెస్

సారాంశం

సెలబ్రెటీలు మెగాస్టార్ కి తమ స్టైల్ లో శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగా అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకి విషెస్ ఏ స్థాయిలో అందిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సెలబ్రెటీలు కూడా మెగాస్టార్ కి తమ స్టైల్ లో శుభాకాంక్షలు తెలుపుతూ వారి స్నేహ భావాన్ని చాటుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.  

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్న చంద్రబాబు మెగాస్టార్ తో నవ్వుతూ ఉన్న ఫొటోని కూడా షేర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు