చంద్రబాబు బయోపిక్: రిలీజ్ కు ఊహించని ట్విస్ట్ ? నిర్మాతకు పరీక్షే

Published : Nov 04, 2018, 10:29 AM IST
చంద్రబాబు బయోపిక్: రిలీజ్ కు ఊహించని ట్విస్ట్ ? నిర్మాతకు పరీక్షే

సారాంశం

  'మహానటి' ఘనవిజయంతో టాలీవుడ్ లో  బయోపిక్స్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నవి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి కూడా. మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీస్తున్న'యాత్ర' డిసెంబర్ 21న రానుంది. 

'మహానటి' ఘనవిజయంతో టాలీవుడ్ లో  బయోపిక్స్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నవి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి కూడా. మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తీస్తున్న'యాత్ర' డిసెంబర్ 21న రానుంది. 

ఇక మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్నబయోపిక్ రెండు భాగాలుగా జనవరి నెలలో తెరపైకి రాబోతోంది.   జనవరి 9న సంక్రాంతి కానుకగా 'యన్.టి.ఆర్ కథానాయకుడు', జనవరి 24న 'యన్.టి.ఆర్. మహానాయకుడు' విడుదల కాబోతున్నాయి. 

ఈ నేపథ్యంలో మరో చిత్రం కూడా తెరకెక్కుతోంది. అదే  చంద్రబాబు బయోపిక్ 'చంద్రోదయం'. ఈ సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నప్పటికీ అది ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అది అసాధ్యం అంటున్నారు.   

సంక్రాంతికి రిలీజ్ అయ్యే  పెద్ద సినిమాల మధ్యలో ఇమేజ్ లేని నటీనటులతో తీసిన 'చంద్రోదయం'కు థియేటర్లు దొరకటం కూడా సాధ్యపడక పోవచ్చంటున్నారు. అయితే చంద్రబాబు బయోపిక్ కాబట్టి ...ఏమన్నా వెసులుబాటు ఉంటుందా అంటే బిజినెస్ విషయంలో అలాంటిదేమీ ఉండదని, అటు ప్రక్క చంద్రబాబు బావమరిది బాలకృష్ణ పోటీలో ఉన్నప్పుడు చేసేదేమి ఉంటుందని చెప్పుకుంటున్నారు. 

అయితే చంద్రోదయం నిర్మాతలు మాత్రం ఎట్టిపరిస్దితుల్లోనూ తమ సినిమా సంక్రాంతికే విడుదలచేయాలనే ప్లానింగ్ లో ఉన్నారట.   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. ఈ చిత్రం పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె. రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే