విశ్వనాథ్ ను చూసి దు:ఖం ఆపుకోలేక... బోరున విలపించిన చంద్రమోహన్

Published : Feb 03, 2023, 03:44 PM ISTUpdated : Feb 03, 2023, 03:57 PM IST
విశ్వనాథ్ ను చూసి దు:ఖం ఆపుకోలేక... బోరున విలపించిన చంద్రమోహన్

సారాంశం

కళాతపస్వీ విశ్వనాథ్ మృతిని తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇక ఆయన్ను ఆరాధించేవారు ప్రేమించేవారి బాధ వర్ణనాతీతం. ఒక దశలో విశ్వనాథ్ భౌతిక కాయం చూసి తట్టుకోలేక బోరున విలపిస్తున్నారు కూడా. 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అలనాటి తారలు ఒక్కొక్కరుగా నేల రాలుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, కైకాల, జమున లాంటి ఉద్దండులను కోల్పోయిన టాలీవుడ్.. మరో మాణిక్యాన్ని కూడా కోల్పోయింది. తెలుగు జాతీ కీర్తిని తన సినిమాలతో ఇనుమడింప చేసిన కళా తపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూయడంతో టాలీవుడ్ ధిగ్బ్రాంతికి లోనయ్యింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక  విలపిస్తున్నారు. 

 గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు కళాతపస్వి కె.విశ్వనాథ్‌.  ఆణిముత్యాలాంటి సినిమాలు అందించి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో  చిరస్థాయిగా నిలిచిపోయారు విశ్వనాథ్.  తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవ చేసిన విశ్వనాథ్‌ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి, వెంకటేష్‌, వెంకయ్య నాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నాగబాబు వంటి ప్రముఖులు విశ్వనాథ్‌ నివాసానికి చేరుకుని.. ఆయనకు నివాళులర్పించారు. 

ఇక ఈ క్రమంలో విశ్వనాథ్ మరణ వార్త తెలిసి  సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ తట్టుకోలేకపోయారు. దిగ్గజ దర్శకుడిని కడసారి చూసేందుకు ఆరోగ్యం సహకరించకపోయినా... లేవలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా తరలి వచ్చారు చంద్రమోహన్. ఆయనకు నివాళులర్పించిన చంద్రమోహన్.. విశ్వనాథ్ ను చూసి బోరున విలపించారు... వెక్కి వెక్కి ఏడ్చాడు.  నిర్జీవంగా ఉన్న కళా తపస్విని చూసి చలించిపోయారు చంద్రమోహన్. ఒక దశలో ఆయన్ను కంట్రోల్ చేయడం ఎవరివల్లా కాలేదు. విశ్వనాథ్ కు బంధువు అయిన చంద్రమోహన్ కెరీర్ ను  సిరిసిరిమువ్వ లాంటి సినిమాతో మలుపు తిప్పారు విశ్వనాథ్‌. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?