తెలుగు హీరోయిన్ చాందిని చౌదరికి వేధింపులు.. ఫోటోలు ఉపయోగించి ఆ మెసేజ్ లు పంపుతూ..

By team teluguFirst Published Dec 11, 2022, 4:01 PM IST
Highlights

తెలుగు బ్యూటీ చాందిని చౌదరి చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. 

తెలుగు బ్యూటీ చాందిని చౌదరి చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతోంది. తన హాట్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్ తో యువతలో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వైజాగ్ అమ్మాయి.. నటిగా కూడా ఎదగాలని భావిస్తోంది.

చాందిని చివరగా కిరణ్ అబ్బవరం సరసన 'సమ్మతమే' అనే రొమాంటిక్ మూవీలో నటించింది. ఆ చిత్రం పర్వాలేదనిపించింది. దీనితో చాందిని టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది. నాజూకు అందాలతో ఆకర్షించే చాందిని చౌదరి అవసరమైన సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకబోయాలని చూస్తోంది. 

అయితే సినీతారలు టార్గెట్ గా, వర్తమాన నటీమణులని, ఇతర నటీనటులని కొందరు సైబర్ నేరగాళ్లు వేధించే ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చాందిని చౌదరి కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడింది. తనని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని స్వయంగా చాందిని చౌదరి సోషల్ మీడియాలో పేర్కొంది. 

'గత కొన్ని నెలలుగా కొందరు వ్యక్తులు అంతర్జాతీయ నంబర్స్ ఉపయోగించి స్కామ్ లు చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు నా పేరు వాడుకుంటున్నారు. మెసేజ్ లు పంపిస్తున్నారు. నా పేరు మాత్రమే కాదు. నా కోస్టార్ట్స్ పేర్లు, ఫోటోలు కూడా వాడుకుంటున్నారు. ఇలా ఎవరికైనా మెసేజ్ లు వస్తే రిపోర్ట్ చేయండి. మీ వివరాలు వారితో షేర్ చేయకండి' అంటూ చాందిని తెలిపింది. 

సదరు వ్యక్తులు మెసేజ్ లు చేయడం మాత్రమే కాక వేధింపులకు కూడా దిగుతున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా చాందిని షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టింది. కలర్ ఫోటో చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. 

click me!