చైతు, సమంతల సొంత వ్యాపారం!

Published : Jun 04, 2019, 04:37 PM IST
చైతు, సమంతల సొంత వ్యాపారం!

సారాంశం

అక్కినేని కుటుంబానికి సంబంధించి ఇప్పటికే రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి.

అక్కినేని కుటుంబానికి సంబంధించి ఇప్పటికే రెండు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ సంస్థల్లో పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు మూడో సంస్థ కూడా రాబోతుందని సమాచారం.

నాగచైతన్య, సమంత కలిసి సొంతంగా ఓ నిర్మాణ సంస్థని మొదలుపెట్టాలని చూస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చైతుకి చాలా కాలంగా సినిమాల ప్రొడక్షన్ చేయాలనుంది. అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మాణ వ్యవహారాలు అప్పుడప్పుడు చూస్తుంటాడు.

'మన్మథుడు 2'కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా సమంత, చైతు చేతుల్లోనే ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నిర్మాణ సంస్థ స్థాపించాలని ప్లాన్ చేస్తున్నారు. తమకు నచ్చిన కథలు వస్తున్నప్పుడు సొంత డబ్బుతో సినిమా తీయాలనుకుంటున్నారు.

ఆ కథల్లో వాళ్లు నటించినా, నటించకపోయినా.. కొత్తవారికి కూడా అవకాశాలు ఇవ్వాలనేది ఇద్దరి ఆలోచన. ఆ కారణంగానే సొంతగా సినిమా బ్యానర్ ని మొదలుపెట్టాలని  అనుకుంటున్నారు. ఎప్పుడు మొదలుపెడతారనేది చూడాలి!

PREV
click me!

Recommended Stories

రాంచరణ్ కోసం వీధుల్లో తిరిగింది, ఈ మూవీ కోసం అప్పు తీసుకుంది.. కూతురు సుస్మిత సీక్రెట్స్ బయటపెట్టిన చిరు
ఎట్టకేలకు రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ..దాని కోసం ట్రై చేయకు అని ముఖం మీదే చెప్పింది ఎవరో తెలుసా ?