విశాల్ ఆరోపణలపై సీరియస్‌‌గా స్పందించిన కేంద్రం, విచారణ ప్రారంభం

తమిళ హీరో విశాల్ సెన్సార్ బోర్డ్ మీద చేసిన లంచం ఆరోపణలపై తీవ్రంగా స్పందించి కేద్రం, సోషల్ మీడియాలో స్పందించి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ... విచారణ స్టార్ట్ అయినట్టు ప్రకటించింది. 
 

central government Reacts on actor vishal Complaint about censor board JMS

తాజాగా సెన్సార్ బోర్డుపై  తీవ్రమైన లంచం ఆరోపణలు చేశారు నటుడు విశాల్. ఆయన చేసిన ఆరోపణలపై అలాగే విశాల్ చేసిన వ్యాఖ్యలపై కూడా  కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ట్విట్టర్  ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ వ్యాఖ్యల నేపథ్యంలో నిజానిజాలు తెలుసుకోవడం కోనసం  విచారణ జరపనున్నట్లు తెలిపింది. 

సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని, అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు ఉంటాయని పేర్కొంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి విశాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు విచారణ జరపనున్నారని తెలిపారు.

Latest Videos

ఇక అసలు విషయానికి వస్తే.. మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయంలో  సభ్యులపై ఆరోపణలు చేశారు విశాల్. ఈసినిమా సెన్సార్ కోసం 6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని  విశాల్ గురువారం ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం 3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. 

అయితే విశాల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక విశాల్ ఇంకాస్త ముందడుగు వేసి..ఎవరెవరికి డబ్బులు పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ, మహా సీఎం షిండేలను ట్యాగ్ చేశారు. దాంతో ఈ విషయంలో  కేంద్ర సమాచార శాఖ సీరియస్‌గా తీసుకుని పై విధంగా స్పందించారు. 

vuukle one pixel image
click me!