
ఈనెల 8న మహిళ దినోత్సవం సందర్భంగా రకరకాల కార్యక్రమంలు ఊపు అందుకున్నాయి. కొన్ని రోజుల ముందు నుంచే ఈ కాన్సెప్ట్ పై డిబెట్లు.. సభలు, ప్రత్యేక ప్రోగ్రామ్స్ ను ఎవరికి వారు డిజైన్ చేసుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే ఓ కార్యక్రమంలో మహిళా దీనోత్సవం సందర్భంగా మాట్లాడినఇంద్రజ అందరిని తన స్పీచ్ తో ఆకట్టుకుంది. ఒక రకంగా షాఇచ్చింది. ఓ కంపెనీ మహిళల కోసం కొత్త ప్రాడక్ట్ లాంచ్ చేసింది. నెలసరి సమయంలో మహిళలకు బాగా ఉపయోగపడే ఓ ప్రత్యేక ఉత్పత్తిని మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. మాజీ హీరోయిన్ సీనియర్ నటి ఇంద్రజ వచ్చారు. . ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు.. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి.
ఇక ఇంద్రజ మాట్లాడుతూ... నేటికి కూడా కొన్ని కమర్షియల్ అడ్వటైజ్ మెంట్ర్స్ లో .. మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికీ ఆర్ధికంగా తమ అవసరాల కోసం మగవారి మీద ఆధారపడుతున్నట్లు చూపుతున్నారు. కానీ వాస్తవంగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకుంటే... ఆడవారు కూడా మగవారితో సమానంగా సంపాధిస్తున్నారు. ఒక రకంగా చూడాలి అంటే.. మగవారికంటే ఎక్కువే సంపాధిస్తున్నారు ఇంకో విషయం ఏంటీ అంటే.. ఆడవారినిమగవారు పోషించే పరిస్థితి మారిపోయి.. మగవారిని ఆడవారు పోషిస్తున్నారు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.
ఇక ఇఫ్పుడు ఉన్న జనరేషన్ లో అసలు ఆడవారు తమ సమస్యల గురించి అర్థం చేసుకోమని మగవారిని అడగాల్సిన పనిలేదు.. పదే పదే బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. అలా అడగడం కూడా వృధా. మన ప్రాబ్లమ్స్‌ని మనలో మనమే ఓపికగా భరిస్తూ.. ఉంటేనే మగవాళ్లు అర్థం చేసుకుంటారు. వారి మెంటాలి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్‌లో పని చేస్తుంది అని చెప్పుకొచ్చారు ఇంద్రజ. అంతే కాదు ఇంటిని, ఫ్యామిలీ వెయిట్ ను మీరే మోయాలని తోందర పడకండీ.. ఆ తర్వాత గుర్తింపు ఇవ్వడం లేదని బాధపడటం కూడా కరెక్ట్ కాదు. మీకు ఓపిక లేదా.. పని చేయలేరా.. ఆ విషయం మీ వాళ్లకు చెప్పి రెస్ట్ తీసుకోండి. మీ గురించి మీరే ఆలోచించుకోకపోతే.. మీ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి మీరు పట్టించుకోకపోతే.. ఇక మగాళ్లు అర్థం చేసుకోవాలని కోరుకోవడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
ఈసమాజంలో ఆడవారి సమస్యలు అర్ధం చేసుకునే మగవారు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు ఇంద్రజ. ఇంకా నెలసరి సమయంలో ఒక్కరు బాధపడటం కంటే.. నలుగురితో చెప్పుకోవడం కోసం సిగ్గుపడకండీ.. దాని వల్ల చాలా నష్టపోతారు. వేసుకునే బట్టలని బట్టే మనల్ని జడ్జ్ చేసే అథమ స్థాయిలో ఉన్న మగవారు కూడా చాలా మంది ఉన్నారు అంటూ మాట్లాడారు ఇంద్రజ. ప్రస్తుతం ఈ వీడియో్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంద్రజ వ్యాఖ్యలపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.