
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ ప్రజలు దుఖ సాగరంలో మునిగిపోయారు.
పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులు ఆర్పిస్తున్నారు. ముందుగా రజినీకాంత్.. కరుణానిధి గారు చనిపోయిన ఈరోజు తన జీవితంలో బ్లాక్ డే అంటూ ప్రకటించారు. ఆ తరువాత రాధిక, ఖుష్బూ ఇలా చాలా మంది సెలబ్రిటీలు కరుణానిధి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించిన సెలబ్రిటీలు..