ప్రచారాల్లో బుల్లితెర స్టార్స్.. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? ఏం చెబుతున్నారు?

Published : Nov 09, 2023, 01:01 PM IST
ప్రచారాల్లో బుల్లితెర స్టార్స్.. ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? ఏం చెబుతున్నారు?

సారాంశం

తెలంగాణలో ఎలక్షన్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. వినూత్నమైన రీతిలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక బుల్లితెర సెలబ్రెటీలు కూడా ప్రముఖ పార్టీకి ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారుతోంది.   

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థుల జాబితా కూడా విడుదలైంది. దీంతో నాయకులు ప్రచారాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రధాన పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS)  వినూత్నంగా ప్రచారం చేస్తోంది. తమ ప్రభుత్వం రెండు దఫాల్లో చేసిన అభివృద్ధిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. 

ఈ క్రమంలో బుల్లితెర సెలబ్రెటీలు సైతం ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారాలు చేస్తున్నారు. Etlunde Telangana Etlaindi Telangana, Vote for KCR అంటూ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మరింతగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. 

బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి (Sreemukhi)  తమ నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధిని చెబుతూ వీడియోను పంచుకుంది. రోడ్లు, డ్రైయినేజీలు, వాటర్ ట్యాంక్స్, ఆస్పత్రులు మెరుగయ్యాయని తెలిపింది. 2014కు ముందు 2023లో నిజామాద్ ఇలా ఉందంటూ తెలియజేసింది.

 

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) కూడా బీఆర్ఎస్ కు మద్దుతు తెలుపుతూ ఓ వీడియోను పంచుకుంది. హైదరాబాద్ లోని ఐకానిక్ ప్లేసెస్ చార్మినార్, బుద్ధుడి విగ్రహమే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన డెవలప్ మెంట్ చెప్పే ప్రయత్నం చేసింది.  వీడియో రూపంలో దుర్గం చెరువు, గండిపేట్, మంచిరేవుల వంటి అర్బన్ ఫారెస్ట్ లు వచ్చాయని, సోలార్ సైక్లింగ్ ట్రాక్.. ఐటీ కారిడార్ లోని వృద్ధిని చెప్పుకొచ్చింది.

 

యాంకర్ విష్ణు ప్రియా (Vishnu Priya)  షేర్ చేసిన వీడియోలో హైదరాబాద్ లోని ట్రాఫిక్ సమస్య తీరిపోయిందని చెప్పుకొచ్చింది. బెస్ట్ గవర్నమెంట్ వల్లే ఫ్లైఓవర్స్, మెట్రో సాధ్యపడాయని, రోడ్ ట్రాన్స్ పోర్ట్ మెరుగైందని అభిప్రాయపడింది.

 

నటి హరితేజ (HariTeja)  ఆడపడుచులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని చెప్పుకొచ్చింది.  పెన్షన్లు, మహిళలకు ఇళ్ల పంపిణీ వంటి వాటిని గుర్తు చేస్తూ ఓ వీడియోను పంచుకుంది.

 

బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ సావిత్రి (Savithri) తెలంగాణలోని నీరుపాదల ప్రాజెక్ట్స్, నీళ్లు, రైతులకు కలిగిన లాభాలను చెప్పే ప్రయత్నం చేసింది. కరెంట్, రైతు భీమా, తదిర అంశాలను వివరించింది. 

 

యాంకర్, జబర్దస్త్ నటి జోర్దార్ సుజాత కూడా హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తు చేసింది. సెక్రటేరియేట్, అమరవీరుల స్థూపం, అంబేదర్క్ విగ్రహ నిర్మాణం.. అంటూ చెప్పుకొచ్చింది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rashmika Mandanna: ఫ్రెండ్స్ తో శ్రీలంక ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న రష్మిక, ఇది బ్యాచిలరేట్ పార్టీనా ?
Director KK Passed Away: నాగార్జున `కేడి` మూవీ డైరెక్టర్‌ కన్నుమూత.. సందీప్‌ రెడ్డి వంగాకి ఈయనే గురువు