విజయ్ తో సరైనోడు బ్యూటీ!

Published : Jan 10, 2019, 07:38 PM IST
విజయ్ తో సరైనోడు బ్యూటీ!

సారాంశం

సరైనోడు - నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించి గ్లామర్ టచ్ ఇచ్చిన క్యాథెరిన్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో నటించేందుకు రెడీ అయ్యింది. 

సరైనోడు - నేనే రాజు నేనే మంత్రి సినిమాల్లో కీలకపాత్రలో కనిపించి గ్లామర్ టచ్ ఇచ్చిన క్యాథెరిన్ ఇప్పుడు విజయ్ దేవరకొండతో నటించేందుకు రెడీ అయ్యింది. గత కొంత కాలంగా కోలీవుడ్  సినిమాలతో బిజీగా ఉన్న ఈ బెంగుళూరు బ్యూటీ టాలీవుడ్ లో పెద్దగా కనిపించడం లేదు. హీరోయిన్ పాత్రలు దక్కకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తోంది. 

అసలు విషయంలోకి వస్తే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజజీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని దర్శకుడు సినిమా కథను సెట్ చేసుకున్నాడు. అయితే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. 

సినిమాలో కీలకమైన కథానాయిక పాత్ర కోసం క్యాథెరిన్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాలు క్యాథెరిన్ కి గ్లామర్ గర్ల్ అని ఒక ముద్ర వేశాయి. మరి రౌడీ బాయ్ తో చేయబోయే ఈ సినిమా ద్వారా ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవల్ అంతే, మెగా బ్లాక్ బస్టర్ పక్కా ?
రాజా సాబ్ నెగెటివ్ టాక్.. ప్రభాస్ కోసం మారుతి మాస్టర్ ప్లాన్, సినిమాలో జరిగిన మార్పులివే..