కోర మీసాలతో మహేష్ ?

Published : Jun 18, 2019, 09:58 AM IST
కోర మీసాలతో మహేష్ ?

సారాంశం

మహేష్ బాబు కథలతో ప్రయోగాలు చేసినట్లుగా ఫిట్ నెస్ లో మాత్రం పెద్దగా మార్పులు చేయడనేది అందరికి తెలిసిన విషయమే. ఎక్కువగా సింపుల్ అండ్ స్మార్ట్ గా ఉండడానికి ఇష్టపడతాడు. అయినప్పటికీ మహేష్ ప్రతిసారి కొత్తగానే కనిపిస్తాడు. కానీ ఈ సారి కథ డిమాండ్ వల్ల మహేష్ ఎంతో కొంత మారక తప్పదని తెలుస్తోంది. 

లైట్ గా కండలు పెంచేసి కోర మీసాలతో దర్శనమిస్తాడని సమాచారం. మరికొన్ని రోజుల్లో సూపర్ స్టార్ అనిల్ రావిపూడితో కొత్త సినిమాను మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు అనే ఆ సినిమాలో మహేష్ ఆర్మీ నుంచి రాయలసీమకు వచ్చిన యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే అందులో పాత్రకు తగ్గట్టుగా బాడ్ లాంగ్వేజ్ మారాలంటే ఫిట్ నెస్ లో అలాగే పేస్ లుక్ చేంజ్ కావాల్సిందే అని చిత్ర యూనిట్ డిస్కర్స్ చేసుకుందట. 

మెయిన్ గా మహేష్ కోర మీసాలతో కనిపించేలా దర్శకుడు ఒక లుక్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మిల్ట్రీ కటింగ్ తో కూడా కనిపించనున్నట్లు టాక్. అయితే మహేష్ కి ఆ కొత్త లుక్ ఎంతవరకు సెట్ అవుతుందనేది ఎవరి ఊహలకు అందడం లేదు. మరి సూపర్ స్టార్ అనిల్ రావిపూడి విజన్ కి తగ్గట్టుగా కనిపిస్తాడో లేదో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్