
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఎపిసోడ్ 68 యుద్ధ భూమిని తలపిస్తూ సాగింది. కెప్టెన్సీ టాస్క్ గందరగోళంగా జరిగింది. రేవంత్ ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న విజువల్స్ తో నేటి ఎపిసోడ్ మొదలైంది. గర్భవతిగా ఉన్న తన భార్యని తలచుకుని రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.
తాను ఒంటరిగా మిగిలిపోయానని, హౌస్ లో ఇలాగే ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పడంతో శ్రీసత్య, శ్రీహాన్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇంతలో కెప్టెన్సీ టాస్క్ మొదలయింది. ఈ టాస్క్ కి సంచాలక్ గా బిగ్ బాస్ రేవంత్ ని నియమించారు.
ఈ టాస్క్ ప్రకారం పోటీ చేసే సభ్యులకు థర్మాకోల్ బాల్స్ నింపిన గోనె సంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. వాటిని వీపున మోస్తూ ముందుగా నిర్ణయించిన సర్కిల్స్ లో ఒకరి వెనుక ఒకరు తిరగాలి. ఆ బ్యాగ్స్ కి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి థర్మాకోల్ బాల్స్ పడిపోకుండా జాగ్రత్తపడుతూ.. ఇతర సభ్యుల నుంచి రక్షించుకుంటూ సర్కిల్స్ లో తిరగాలి. సమయం ముగిసే సమయానికి ఎవరి సంచిలో ఎక్కువ థర్మాకోల్ బాల్స్ ఉంటాయో వారు నెక్స్ట్ రౌండ్ కి వెళతారు. అతితక్కువ థర్మాకోల్స్ ఉన్న వారు పోటీ నుంచి తప్పుకుంటారు.
రేవంత్.. పోటీదారులు రూల్స్ అతిక్రమించకుండా చూసుకోవాలి. తొలి రౌండ్ లో కీర్తి పక్కకి వెళుతుంది. సెకండ్ రౌండ్ లో రోహిత్, మెరీనా, శ్రీసత్య, ఆది రెడ్డి, ఫైమా పాల్గొంటారు. ముందుగా మెరీనా తప్పుకుంటుంది. రోహిత్, ఫైమా, ఆది రెడ్డి అయితే దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. గేమ్ గందారగోళంగా మారుతున్నా సంచాలక్ గా రేవంత్ ఏమి చేయలేకపోతాడు.
ఫైమా చేయి ఇరుక్కుపోయిన ఆమె తగ్గేదే లే అంటూ రోహిత్ తో పోరాడుతుంది. రోహిత్, ఫైమా ఇద్దరూ ఒకరిపై ఒకరు అటాక్ చేసుకుంటారు. ఇది ఆది రెడ్డికి బాగా కలసి వచ్చింది. మొత్తంగా రెండవ రౌండ్ లో రోహిత్ డిస్ క్వాలిఫై అవుతాడు. కానీ ఆట జరిగిన విధానం రోహిత్ కి ఏమాత్రం నచ్చలేదు. దీనితో అతడి కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంతలో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.