ప్రతి ఒక్కడికి నా పెళ్లి గురించే కావాలి.. రానా సినిమా ట్రైలర్

Published : Aug 16, 2018, 11:13 AM ISTUpdated : Sep 09, 2018, 12:25 PM IST
ప్రతి ఒక్కడికి నా పెళ్లి గురించే కావాలి.. రానా సినిమా ట్రైలర్

సారాంశం

49 ఏళ్ల వయసు గల వ్యక్తికి పెళ్లి కాలేదని అతడి గురించి ఊర్లో ఆడవాళ్లంతా తేడాగా మాట్లాడుకుంటున్నారని చాటింపు వేయడంతో ట్రైలర్ మొదలైంది. ఆ 49 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించిన నటుడు 'ఊర్లో ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే' అంటూ తిట్టుకుంటూ వెళ్తుంటాడు

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఓ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కథ నచ్చడంతో ఆయనే సమర్పకుడిగా మారారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. 'కేరాఫ్ కంచరపాలెం'. రానా అంతగా నమ్ముతున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వైజాగ్ దగ్గరలో ఉన్న కంచరపాలెం అనే ప్రాంతంలో జరిగే ఓ కథే ఈ సినిమా.

49 ఏళ్ల వయసు గల వ్యక్తికి పెళ్లి కాలేదని అతడి గురించి ఊర్లో ఆడవాళ్లంతా తేడాగా మాట్లాడుకుంటున్నారని చాటింపు వేయడంతో ట్రైలర్ మొదలైంది. ఆ 49 ఏళ్ల వ్యక్తి పాత్రలో నటించిన నటుడు 'ఊర్లో ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి మాట్లాడుకునేవాడే' అంటూ తిట్టుకుంటూ వెళ్తుంటాడు. ఆ వయసులో అతడు ఓ మహిళను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోమని పంచాయితీ పెట్టి మరీ అతడికి క్లాస్ తీసుకుంటుంటారు. మరో కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయితో 'తొలిసారి వైన్ షాప్ కి వచ్చినప్పుడు చూశా అప్పుడే నిన్ను చూసి పడిపోయా' అంటూ చెబుతుంటాడు.  

ఇలా ట్రైలర్ మొత్తం సహజత్వంతో నిండిపోయింది. ఏదో సినిమా ట్రైలర్ చూస్తున్న ఫీలింగ్ కలగకుండా మన చుట్టుపక్కన జరిగే పరిస్థితులను చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని, ఈ సినిమా ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని.. ఈ ఏడాదిలో రాబోతున్న అతి పెద్ద చిన్న సినిమా ఇదేనంటూ రానా ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు