'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

Published : Jan 07, 2019, 04:53 PM ISTUpdated : Jan 07, 2019, 04:55 PM IST
'పేటా' నిర్మాతపై అల్లు కాంపౌండ్ ఫైర్!

సారాంశం

నిన్న జరిగిన 'పేటా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతలు ప్రసన్న, అశోక్ వల్లభనేనిలు నోటికోచ్చినట్లుగా ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలపై మండిపడ్డారు.

నిన్న జరిగిన 'పేటా' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర నిర్మాతలు ప్రసన్న, అశోక్ వల్లభనేనిలు నోటికోచ్చినట్లుగా ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలపై మండిపడ్డారు. అల్లు అరవింద్, దిల్ రాజు, యువి సంస్థలు కుక్కలంటూ సంభోదించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ నిర్మాతలపై అల్లు కాంపౌండ్ ఫైర్ అయింది. 

గీతా ఆర్ట్స్ సంస్థలో కీలక పాత్ర పోషించే నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా 'పేటా' నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చాడు. ''ప్రసన్న గారు,తమరు తెలిసీ తెలియని మిడి మిడి జ్ణానంతో మాటలు జారుతున్నారు. మేము సహనం కోల్పొయే పరిస్థితి కి తీసుకొస్తున్నారు. తిట్టాలి అనుకుంటే మేము సంస్కారం అనే హద్దుని దాటడం మాత్రమే మిగిలింది'' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

ప్రసన్న పేరు నేరుగా ప్రస్తావించడంతో ఇక వాదోపవాదాలకు చర్చ లేకుండా పోయింది. అల్లు కాంపౌండ్ నుండి వార్నింగ్ వచ్చేసింది కాబట్టి మరి దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు ఎలా స్పందిస్తారో చూడాలి!

 

''అల్లు అరవింద్, దిల్ రాజు కుక్కలా..?''

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి