నేను ఓటేయలేను.. స్పందించిన RRR హీరోయిన్!

Published : Apr 14, 2019, 11:42 AM IST
నేను ఓటేయలేను.. స్పందించిన RRR హీరోయిన్!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మొదటిసారి సౌత్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ RRRలో చరణ్ కు మరదలిగా నటిస్తున్న అలియా ఇటివల ఓటు హక్కుపై స్పందించింది. 

అమ్మడు గత కొన్నేళ్లుగా ఓటు వేయడం లేదు. రీసెంట్ గా మీడియా సమావేశంలో పాల్గొన్న అలియా అందుకు సంబందించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. నేను భారతీయురాలినే కానీ నా దగ్గర ఇండియన్ పాస్ పోర్ట్ లేదు. నాకు ఇండియన్ పాస్ పోర్ట్ రావాల్సి ఉందని ఆమె వివరణ ఇచ్చింది. అలియా తల్లి బ్రిటిష్ పోరురాలు కావడంతో అలియాకు కూడా అక్కడి పాస్ పోర్ట్ ఉంది. 

అలియాకే కాకుండా.. కత్రినా - అక్షయ్ కుమార్ వంటి వారికి ఇండియాలో పౌరసత్వం లేకపోవడంతో ఓటువేయలేని పరిస్థితి. కొందరు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ రిజెక్ట్ అవుతోంది. మరి వీరంతా ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ లో పేర్లను ఎప్పుడు నమోదు చేసుకుంటారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌