RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. బ్లాస్టింగ్ మొదలు అంటూ క్రేజీ కామెంట్స్

Published : Mar 27, 2024, 10:16 PM ISTUpdated : Mar 27, 2024, 10:18 PM IST
RC16 నుంచి అదిరిపోయే అప్డేట్.. బ్లాస్టింగ్ మొదలు అంటూ క్రేజీ కామెంట్స్

సారాంశం

గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అదే విధంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే రెండవ చిత్రానికి కూడా ప్రకటన వచ్చేసింది. 

దీనితో రాంచరణ్ సినిమాల లైనప్ చాలా క్రేజీగా మారిపోయింది. నేడు రాంచరణ్ 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకి బుచ్చిబాబు, మైత్రి నిర్మాతలు, దిల్ రాజు, డైరక్టర్ బాబీ, మంచు మనోజ్ లాంటి వారంతా అతిథులుగా హాజరయ్యారు. 

బుచ్చిబాబు మాట్లాడుతూ తన జర్నీ గురించి మాట్లాడాలంటే ముందుగా చిరంజీవి గారికే కృతజ్ఞతలు చెప్పాలని తెలిపాడు. యాంకర్ గా వ్యవహరించిన శ్యామల.. RC 16 గురించి ఫ్యాన్స్ కోసం ఏదైనా లీక్ ఇవ్వాలని కోరింది. దీనితో బుచ్చిబాబు మాట్లాడుతూ.. రెహమాన్ సర్ ఆల్రెడీ 3 సాంగ్స్ కంప్లీట్ చేశారు. సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. 

ఈ చిత్రంలో ఫస్ట్ సాంగ్ తోనే బ్లాస్టింగ్ అయిపోతుంది అంటూ అంచనాలు పెంచేశాడు. ఫస్ట్ సాంగ్ నుంచే ఆ మొమెంటమ్ మొదలవుతుందని తెలిపాడు. దీనితో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి కాగానే RC 16 షూటింగ్ మొదలవుతుంది. ఈ చిత్రంలో చరణ్ కి జోడిగా అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్