నాటు నాటు పాటను ఎంజాయ్ చేస్తున్న సౌత్ కొరియన్ స్టార్ సింగర్

Published : Mar 04, 2023, 04:49 PM ISTUpdated : Mar 04, 2023, 04:52 PM IST
నాటు నాటు పాటను  ఎంజాయ్ చేస్తున్న సౌత్ కొరియన్ స్టార్  సింగర్

సారాంశం

ప్రపంచ వ్యాప్త గుర్తింపుతో దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక నాటు నాటు పాట అయితే.. ఆస్కార్ కు అడుగు దూరంలలో ఉంది. ఇక ఈపాట ఆస్కార్ రేసులో ఉండటంతో.. హాలీవుడ్ స్పీకర్స్ లో మారుమోగుతోంది. 

ప్రపంచ వ్యాప్త గుర్తింపుతో దూసుకుపోతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇక నాటు నాటు పాట అయితే.. ఆస్కార్ కు అడుగు దూరంలలో ఉంది. ఇక ఈపాట ఆస్కార్ రేసులో ఉండటంతో.. హాలీవుడ్ స్పీకర్స్ లో మారుమోగుతోంది. 

ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మ్యానియా నడుస్తోంది. మన దేశ వ్యాప్తంగా నాటు నాటు ఫీవర్‌ కొనసాగుతోంది. టాలీవుడ్‌  స్టార్‌ నటులు ఎన్టీఆర్  ‌, రామ్‌చరణ్‌  నటించిన ఈక సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఊపు ఊపేస్తోంది. ఇక ఈ మూవీలో నాటు నాటు సాంగ్ అయితే ఆస్కార్ కు అడుగు దూరంలో ఉంది. ఇప్పటికే ఆస్కార్ తరువాత అంతటి అవార్డ్ గోల్డెన్ గ్లోబ్ ను కూడా సాధించింది. ఇక ఇప్పుడు ఆస్కార్ రేసులో ఉండటంతో.. ఈ పాట ప్రపంచ సంగీత దర్శకులను.. వరల్డ్ ఫేమస్ సింగర్స్ ను కూడా ఆకర్షిస్తోంది. వారి చేత కూడా శభాస్ అనిపిస్తోంది.  

నాటు నాటు..  పాటకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బీట్‌కే చిన్నా, పెద్దా తేడా లేకుండా స్టెప్పులేసి నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. ఎంతో మంది వరల్డ్ ఫేమస్ యాక్టర్స్.. ప్లేయర్స్.. ఈ పాటకుడాన్స్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పటికీ ఏడాది కావవస్తన్నా.. ఈపాట మ్యానియా తగ్గలేదు. తాజాగా  ఈ జాబితాలోకి క్షిణ కొరియా  మ్యూజిక్‌ బ్యాండ్‌  బీటీఎస్‌  సింగర్‌ జంగ్‌కుక్‌  కూడా వచ్చి చేరారు. ఇటీవల అభిమానులతో లైవ్‌  నిర్వహించిన జంగ్‌కుక్ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని నాటు నాటు  పాటను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. తన సీటులో కూర్చొనే నాటు నాటుకు సరదాగా స్టెప్పులేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఇక ఆయన ఈ వీడియోను... సాంగ్ ను బాగా ఎంజాయ్ చేయడంతో.. ఇది వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం తాజాగా స్పందించింది. జంగ్‌కుక్ ఈ పాటను నువ్వు ఇంతలా ప్రేమిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్‌ టీమ్ తో పాటు దక్షిణ కొరియా మొత్తానికి టన్నుల కొద్దీ ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు టీమ్. 

 

ఇక అసలు ఈ సౌంత్ కొరియన్ బీటీఎస్‌ గుంరించి చెప్పాలి అంటే.. South Koreaకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ బ్యాండ్ జంగ్‌కుక్‌, ఆర్‌ఎం, వి, జిమిన్‌, జిన్‌, జె.హోప్‌, సుగా.. ఇలా ఓ ఏడెనిమింది మంది మెంబర్స్ తో ఓ బ్రాండడ్ మ్యూజిక్ ట్రూప్ నడుస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించి మ్యూజిక్ ట్రూప్. వీరికి కోట్లలో అభిమానులు కూడా ఉన్నారు. ఇక  వీరు చేసిన వాటిలో ఫేక్‌ లవ్‌, బాయ్‌ విత్‌ లవ్‌ లాంటి ఆల్భం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. న ఇండియాలో కూడా అతనికి భారీగా ఫ్యాన్స ఉన్నారు.  

ఇక టాలీవుడు జక్కన్న దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన  ఆర్‌ఆర్‌ఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ రాజుగా  రామ్‌ చరణ్‌ నటించారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఈసినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ కు నామినేట్‌ అయ్యింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ టాప్‌ -4లో నిలిచింది. ఇక ఈ నెల 12న జరగబోయే అస్కార్ అవార్డ్స్ వేడుకలో నాటునాటు పాట పాడబోతున్నారు కూడా. మరి ఆస్కార్ ను ఈ పాట సాధిస్తుందా లేదా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..