స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో మంచి స్నేహితురాలు ఎవరైనా ఉన్నారంటే అది నందిని రెడ్డి మాత్రమే అని చెప్పొచ్చు. ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో సమంత ఎమోషనల్ అవుతూ విషెస్ తెలిపారు..
ఫిల్మ్ డైరెక్టర్, స్కీన్ రైటర్ గా నందిని రెడ్డి (Nandini Reddy) ఇండస్ట్రీలో మంచి ఫేమ్ దక్కించుకున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్బంగా స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నందినీ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఎప్పటి నుంచో సమంతకు మంచి ఫ్రెండ్ గా అన్ని విషయాల్లో అండగా నిలుస్తున్న నందినీ రెడ్డికి చాలా భావోద్వేగంగా బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
నందినీ రెడ్డిని కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘ప్రతి ఒక్కరి జీవితంలో నీలాంటి ఫ్రెండ్ అవసరం. ఎప్పుడూ బాధలు, కష్టాలు దరిచేరనివ్వరు. బాధలోనూ నవ్విస్తూంటావ్. ఈ జీవితంలో నువ్వులేకపోతే నేనేం చేయలేగలను. నువ్వంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం నందిని రెడ్డి. హ్యాపీ బర్త్ డే’ అంటూ నోట్ లో పేర్కొంది. సామ్ విషెస్ నందినీ రెడ్డి సంతోషిస్తూ రిప్లై ఇచ్చింది. సామ్.. బిహగ్స్.. అంటూ ధన్యవాదాలు తెలిపింది. ఇక సమంత - నందినీ రెడ్డి కాంబోలో ‘జబర్దస్త్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
undefined
ఆ సినిమా సమయంలోనే సీనియర్ హీరో సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడిందని, కొన్ని కారణాలతో ఆ ట్రాక్ నుంచి బయటకి వచ్చింది. ఆసమయంలో నందినీ రెడ్డినే సమంతకు ధైర్యానిచ్చి స్ట్రాంగ్ అయ్యేలా చేసిందని ప్రచారం. ఆ తర్వా వీరి కాంబోలో ‘హో బేబీ’, ‘సామ్ జామ్’ టాక్ షో కూడా రన్ అయిన విషయం తెలిసిందే. ఇక నందీని రెడ్డి గురించి చాలా మందికే తెలిసి ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో లేడీ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అంతకుముందే ‘లిటిల్ సోల్జర్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’, ‘జబర్దస్త్’, ‘కళ్యాణ వైభోగమే’, ‘హో బేబీ’, ‘పిట్ట కథలు’ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘అన్ని మంచి శకునాలే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.