సోనూ సూద్ సాయంపై బ్రహ్మానందం అలా అనేశాడేంటి..!

Published : Aug 17, 2020, 08:46 PM IST
సోనూ సూద్ సాయంపై బ్రహ్మానందం అలా అనేశాడేంటి..!

సారాంశం

గత నాలుగు నెలలుగా సోనూ సూద్ అనే పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుంది. ఆయన్ని అభినవ దానకర్ణుడిగా ప్రజలు కీర్తిస్తున్నారు. కాగా సోనూ సూద్ సాయంపై హాస్య బ్రహ్మ బ్రహ్మనందం కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హాస్య బ్రహ్మగా వెండితెరపై తిరుగులేని వెలుగు వెలిగిన బ్రహ్మనందం ఏ విషయంపైన అయినా స్పందిచే తీరు ఆసక్తికంగా ఉంటుంది. సంఘటనలను ఆయన విశ్లేషించే తీరు కొత్తగా ఉంటుంది. అలాగే ఆఫ్ స్క్రీన్ పైన కూడా ఆయన మాటలు వ్యంగ్యంతో కూడుకొని ఉంటుంది. తాజాగా ఆయన సోనూ సూద్ దాన గుణంపై స్పందించి తీరు ఆసక్తికరంగా మారింది. బ్రహ్మానందం మాట్లాడుతూ సోనూ సూద్ సూర్యుడైతే నేను మిణుగురు పురుగు. సోనూ సూద్ కూడా వలస వచ్చినవాడు. అందుకే ఆయనకు తోచినంతలో సాయం చేశారు. నేను కూడా ఈ మధ్య కాలంలో అనేక దానాలు చేశాను. ఐతే నేను సోనూ సూద్ వలె ఫోటో దిగకుండా తప్పు చేశాను అన్నారు.

 ఒక వైపు సోనూ సూద్ ని పొగుడుతూనే, చేస్తున్న దానాన్ని పబ్లిసిటీ చేసుకుంటున్నారని సెటైర్ వేసినట్లు అనిపించింది. ఇక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నేను అలాగే ఉంటాను అన్నారు. ఓ సీనియర్ కెమెరా మెన్ కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో నా ఇంటికి వచ్చారు. ఆయనకు నేను చేసింది దానం అనకూడదు అన్నారు. మనం డబ్బు విషయంలో జాగ్రత్త పడకపోతే మనం రేపు మరొకరి సాయం కోసం వేచి చూడాల్సి వస్తుంది అన్నారు. 

ఇక తనకు సినిమా అవకాశాలు తగ్గాయన్న విషయంపై ఆయన స్పందించారు. ఏళ్లుగా లెక్కకి మించిన సినిమాలలో నటించాను. ఇకపై కేవలం నచ్చిన పాత్రలనే చేయాలనుకుంటున్నాను అని బ్రహ్మనందం తనదైన శైలిలో చెప్పారు. బ్రహ్మనందం తన మాటలలో సాయం, డబ్బు విలువ మరియు తన సినిమా అవకాశాలు వంటి విషయాలపై మాట్లాడారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్