బ్రేకింగ్: హీరో విశాల్ కు తీవ్ర గాయాలు!

Published : Mar 28, 2019, 09:39 AM IST
బ్రేకింగ్: హీరో విశాల్ కు తీవ్ర గాయాలు!

సారాంశం

ప్రముఖ తమిళ హీరో విశాల్ తీవ్ర గాయాలపాలయ్యారు. సినిమా షూటింగ్ లో ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన గాయపడ్డారు. 

ప్రముఖ తమిళ హీరో విశాల్ తీవ్ర గాయాలపాలయ్యారు. సినిమా షూటింగ్ లో ఫైట్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనగాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాల్, తమన్నా జంటగా సుందర్.సి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఫైట్ సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుండి విశాల్ కి అలవాటు. గతంలో 'తుప్పరివాలన్' సినిమా షూటింగ్ లో కూడా ఈ హీరో గాయపడ్డాడు. ఇక విశాల్ నటిస్తోన్న 'అయోగ్య' సినిమా మే 10న ప్రేక్షకుల  ముందు రానుంది. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు