హీరోయిన్ తో కర్రీ పాయింట్ ఓపెన్ చేయించిన కిర్రాక్ ఆర్పీ, సందడి చేసిన మంత్రి రోజ

Published : Nov 21, 2023, 12:55 PM IST
హీరోయిన్ తో కర్రీ పాయింట్ ఓపెన్ చేయించిన కిర్రాక్ ఆర్పీ, సందడి చేసిన మంత్రి రోజ

సారాంశం

వ్యాపారంలో దూసుకుపోతున్నాడు జబర్థస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారం విస్తరింపచేసిన ఆర్పీ..తాజాగా మరో బ్రాంచ్ ను చాలా ఘనంగా స్టార్ట్ చేశాడు. ఇంతకీ ఎక్కడంటే..?   

జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ డమ్ సంపాదించాడు ఆర్పి. కిర్రాక్ ఆర్పీగా పేరు తెచ్చుకుని.. టీమ్ లీడర్ గా కూడా మంచి మంచి స్కిట్ లు చేశాడు. ఆయన ఏం స్కిట్ చేసినా.. నెల్లురు యస.. నెల్లురు పదం, వెంకటేశ్వరావు.. ఈ మూడు ఉండేట్టు చూసుకునేవాడు. జబర్థస్తు నుంచి బయటకు వచ్చి.. ఆ షోపై.. నిర్వాహకులపై ఘాటు విమర్షలు చేశాడు ఆర్పీ.. 
 
కామెడీ షో నుంచి బయటకు వచ్చి..వెండితెరపై వెలగాలి అనుకున్నాడు కీరాక్ ఆర్పీ. దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుని..దెబ్బతిన్నాడు. ఇక లాభం లేదు అని.. బిజినెస్ వైపు వచ్చాడు ఆర్పీ. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు స్టార్ట్ చేశాడు.  బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి.. దూసుకుపోతున్నాడు ఆర్పీ. ఈ విషయంలో మంచి సక్సెస్ ను వెనకేసుకుకోవడంతో పాటు మంచి లాభాలు కూడా వెనకేసుకుంటున్నాడు ఆర్పీ. 

ఇక ఆర్పీ  ఒక్క బ్రాంచ్ తో ఆపకుండా.. ఈ చేపల పులుసు పేరు మీద.. ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు ఆర్పి. హైదరాబాద్ లోనే  కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఇచ్చిన ఆర్పీ.. భారీగా లాభాలు సాధిస్తున్నాడు. తాజాగా మరో బ్రాంచ్ ను ఘనంగా స్టార్ట్ చేశాడు ఆర్పీ. 

 తాజాగా తిరుపతిలో కూడా కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు కిరాక్స ఆర్పీ. ఈ రెస్టారెంట్  ఓపెనింగ్ ను  చాలా  గ్రాండ్ గా  ప్లాన్ చేశారు ఆర్పీ. కర్రీ పాయింట్ ఓపెనింగ్ కు ఏకంగా హీరోయిన్ మెహరీన్ ను.. మాజీ హీరోయిన్ ప్రస్తుత ఏపీ మినిష్టర్  రోజా ను పిలిచాడు. ఈ ఇద్దరు తారలు ఈ ఓపెనింగ్ లో  సందడి చేశారు.

ప్రస్తుతం ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రోజా చేపల పులుసు టేస్ట్ చేయమని కోరడంతో ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో తాను టెస్ట్ చేయలేనని తరువాత మరోసారి తప్పకుండా వచ్చి చేపల పులుసు టేస్ట్ చేస్తాను అంటూ రోజా తెలియజేశారు. 

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు కిరాక్ ఆర్పీకి ఆకాంక్షలు తెలియచేస్తున్నారు. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన బ్రాంచ్ లు ఓపెన్ చేశాడు కిర్రాక్ ఆర్పీ.. ఆతరువాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపచేయాలి అని చూస్తున్నారు. తిరుపతి లో స్టార్ట్ అవ్వడంతో.. నెక్ట్స్ దగ్గరలో ఉన్న మద్రాస్ లో కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!