బ్రహ్మీని అడ్డం పెట్టి ‘రానా నాయుడు’కు వెంకీ ని ఎలా ఒప్పించారంటే... (వీడియో)

Published : Mar 15, 2023, 11:59 AM IST
 బ్రహ్మీని అడ్డం పెట్టి  ‘రానా నాయుడు’కు వెంకీ ని ఎలా ఒప్పించారంటే... (వీడియో)

సారాంశం

బ్రహ్మానందం ఆడిషన్‌ చూసి విసుగుచెందిన వెంకటేశ్‌..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..


  రానా నాయుడులో కొత్త రోల్‌లో కనిపించాడు వెంకటేష్. ఈ సిరీస్‌లో నాగ నాయుడిగా తండ్రి పాత్రలో నటించాడు. సుందర్‌ ఆరోన్‌, లోకోమోటివ్‌ గ్లోబల్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ ఎస్‌.వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దయచేసి కుటుంబంతో కలిసి చూడొద్దని మొదటి నుంచి యూనిట్‌ అంతా  చెప్తోంది. చూసేవాళ్లు చూస్తున్నారు. చూసి తిట్టేవాళ్లు తిడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సీరిస్ ప్రమోషన్ కోసం నెట్ ప్లిక్స్ వారు ఓ వీడియో విడుదల చేసారు. 

ఈ వీడియోలో  బ్రహ్మానందం కనిపించి నవ్వించారు. ఈ  స్పెషల్‌ వీడియోని నెట్‌ఫిక్స్‌ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను  ఆస్కార్‌ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్‌లో వెంకటేశ్‌ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్‌ కోసం ఆడిషన్స్‌ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్‌గా, జబర్దస్త్‌ అవినాష్‌ ఆయన అసిస్టెంట్‌గా కనిపించారు. ఈ స్పెషల్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

బ్రహ్మానందం ఆడిషన్‌ చూసి విసుగుచెందిన వెంకటేశ్‌..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్‌కి నా ఏజ్‌ సరిపోలేదని.. వెంకటేశ్‌ను పెట్టారు. ఓకే..  ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్‌ రానా నాయుడు. స్ట్రీమింగ్‌ ఆన్‌ నెట్‌ఫ్లిక్స్‌’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది.  

ఇదిలా ఉంటే ...డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, బూతులతో నిండిపోయిందీ సిరీస్‌. వెంకటేశ్‌ నోట బూతులు రావడం తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. వెంకీ ఫ్యామిలీమాన్‌ అయ్యుండి ఇంత దిగజారి సిరీస్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను సౌత్‌ ఆడియన్స్‌ ఎలా ఇష్టపడతారనుకుంటున్నారు? అని నిలదీస్తున్నారు. బూతులు తప్ప కథ లేదని మండిపడుతున్నారు. ఎంతో ఎక్స్‌పెక్ట్‌ చేశాం, కానీ డిజాస్టర్‌ అవడం ఖాయం అని రివ్యూలు ఇస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా