కర్నాటక ఫలితాలుః బ్రహ్మానందం ప్రచారం చేసిన అభ్యర్థి ఓటమి..

Published : May 13, 2023, 01:54 PM IST
కర్నాటక ఫలితాలుః బ్రహ్మానందం ప్రచారం చేసిన అభ్యర్థి ఓటమి..

సారాంశం

ఇటీవల కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో కమెడియన్‌ బ్రహ్మానందం.. వైద్య శాఖ మంత్రి సుధాకర్‌ తరఫున ప్రచారం చేశారు. తాజా ఫలితాల్లో ఆయన ఓటమి చెందారు.

కర్నాటక ఎన్నికల ఫలితాలు తుదిదశకు చేరుకున్నాయి. కాంగ్రెస్‌కి మెజార్టీ కనిపిస్తుంది. అధికార బీజేపీ వెనకంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో హ్యాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి పెద్ద షాక్‌ తగిలింది. కర్నాటకలో తెలుగువారే ఆయనకు పెద్ద షాకివ్వడం గమనార్హం. కర్నాటక ఎన్నికల్లో బ్రహ్మానందం కూడా ప్రచారం చేశారు. ఆయన చిక్‌ బళ్లాపూర్‌ అభ్యర్థి ప్రస్తుత వైద్య శాఖ మంత్రి సుధాకర్‌ గెలుపు కోసం బ్రహ్మి ప్రచారం చేశారు. బీజీపీ పార్టీ అభ్యర్థి సుధాకర్‌ని గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. కానీ తాజాగా విడుదలైన ఫలితాల్లో మంత్రి సుధాకర్‌ ఓటమి పాలయ్యారు. 

అయితే చిక్‌ బళ్లాపూర్‌లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. దీంతో తెలుగు స్టేట్స్ లో మంచి ఫాలోయింగ్‌, క్రేజ్‌ ఉన్న కమెడియన్‌ బ్రహ్మానందంతో ప్రచారం చేయిస్తే గెలుపు ఈజీ అవుతుందని బీజీపీ పార్టీ,అభ్యర్థి సుధాకర్‌ భావించారు. దీంతో ఆయనతో ప్రచారం చేయించారు. గత ఎన్నికల్లోనూ సుధాకర్‌ తరఫున బ్రహ్మానందం ప్రచారం చేశారు. ఆ టైమ్‌లో ఆయన విజయం సాధించారు. ఈ సారి కూడా గెలుపుని కాంక్షిస్తూ ప్రచారం చేయగా ఓటర్లు షాకిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ ఈశ్వర్‌ .. సుధాకర్‌పై గెలుపొందారు. సుమారు 11వేలకుపైగా ఓట్ల మెజార్టీతో ప్రదీప్‌ ఈశ్వర్‌ విజయం సాధించడం విశేషం. 

కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం... చిక్ బల్లాపూర్ లో రోడ్ షో

దీంతో తెలుగు ఓటర్లు ఇటు బ్రహ్మానందానికి, అటు బీజీపీ మంత్రి సుధాకర్‌కి పెద్ద షాకిచ్చారని చెప్పొచ్చు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కర్నాటకలో బీజీపీ గట్టి దెబ్బ తగిలింది. గతంలో వారు చేసిన అవినీతి కారణంగానే ఈ ఓటమి చవిచూడాల్సి వచ్చిందని స్థానిక ప్రజలు, లీడ్‌లో కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆ మధ్య తారకరత్న బెంగుళూరులో నారాయణహృదయాలయలో చికిత్స తీసుకునే సమయంలో మంత్రి సుధాకర్‌ దగ్గరుండి చూసుకున్నారు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ వెళ్లినప్పుడు కూడా ఆయన దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?