అఫీషియల్.. BoyapatiRapo నుంచి ఫస్ట్ థండర్ రెడీ.. ఉస్తాద్ బర్త్ డేకు మరో ట్రీట్ కూడా?

By Asianet News  |  First Published May 13, 2023, 1:28 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం BoyapatiRapo. చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్  రెడీ అయ్యింది. తాజాగా యూనిట్ అప్డేట్ అందించింది. 
 


ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘బోయపాటిరాపో’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల పరంగా తన మార్క్ క్రియేట్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Sreenu) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రామ్ పోతినేని కథానాయకుడిగా యంగ్ హీరోయిన్  శ్రీలీలా కథానాయికగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ అందించడంతో BoyapatiRapo మూవీపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. 

అయితే, మే 15న రామ్ పోతినేని పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ను అందించబోతున్నారు. స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. BoyapatiRapo First Thunder పేరిట అప్డేట్ రానుంది. రామ్ పోతినేని బర్త్ డే రోజు మే15న ఉదయం 11.25 గంటలకు గ్లింప్స్ రానుంది. అప్డేట్ అందిస్తూ అదిరిపోయే పోస్టర్ ను కూడా వదిలారు. పోస్టర్ లో రామ్ ఊరమాస్ అవతార్ లో దర్శనమిచ్చారు. చేతిలో బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని ప్రత్యర్థులను చితకబాదేందుకు రెడీగా ఉన్నట్టు కనిపించారు. 

Latest Videos

ఒక్కపోస్టర్ తో రామ్ పోతినేని మంచి యాక్షన్ ను అందించబోతున్నారని, చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేశారు.  ఈ చిత్రం ప్రధాన భారతీయ భాషల్లో అక్టోబర్ 20, 2023న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ‘ది వారియర్’ చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస చిట్టూరినే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పకులు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

కాగా, రామ్ పోతినేని అభిమానులకు ఆయన పుట్టిన రోజున మరో గుడ్ న్యూస్ కూడా అందబోతుందని అంటున్నారు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించి బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. చివరిగా పూరి ‘లైగర్’తో దెబ్బతినడంతో ఆయన లైనప్ దెబ్బతింది. దీంతో మళ్లీ రామ్ పోతినేనితోనే ‘ఇస్మార్ట్ శంకర్ 2’ చిత్రాన్ని రూపొందించబోతున్నారని టాక్. దీనికి సంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అదే రోజున ఉండోచ్చని అంటున్నారు. దీంతో రామ్ అభిమానులకు డబుల్ ట్రీట్ అందనుందని తెలుస్తోంది.

We have Something Crazy in Store to make USTAAD 's Birthday More Special❤️‍🔥

Dropping the 𝐅𝐢𝐫𝐬𝐭 𝐓𝐡𝐮𝐧𝐝𝐞𝐫 on May 15 @ 11:25 AM⚡💥 pic.twitter.com/7Ut6skNsFB

— #𝐁𝐨𝐲𝐚𝐩𝐚𝐭𝐢𝐑𝐀𝐏𝐎 (@BoyapatiRAPO)
click me!