
అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి పేరు మారుమోగుతోంది. అఖండ చిత్రంలో బాలయ్యని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. ఫలితంగా వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయం నమోదైంది. దీనితో బోయపాటి తదుపరి చిత్రం ఏంటనే చర్చ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. వాస్తవానికి అఖండ తర్వాత బన్నీతో మూవీ చేయాలని బోయపాటి ప్లాన్ చేసుకున్నారు.
అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రెండవ చిత్రం దాదాపుగా ఖరారైంది. గతంలో వీరిద్దరి కాంబోలో సరైనోడు లాంటి సూపర్ హిట్ వచ్చింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ ఇప్పట్లో కుదిరేలా కనిపించడం లేదు.
పుష్ప పార్ట్ 1 మంచి విజయం అందుకుంది. దీనితో బన్నీ పార్ట్ 2 కూడా పూర్తయ్యాకే మరో చిత్రంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నాడు. దీనితో ఈ ఏడాది దాదాపుగా పుష్ప పార్ట్ 2 తోనే అల్లు అర్జున్ బిజీగా ఉంటాడు. అంటే బోయపాటికి హ్యాండ్ ఇచ్చినట్లే. దీనితో బోయపాటి తన ప్లాన్స్ చేంజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీనితో బోయపాటి ఎనెర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. రామ్ పోతినేని బోయపాటితో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ ఇమేజ్ పెరగాలంటే ఏ హీరోకైనా బోయపాటి లాంటి డైరెక్టర్ కావాలి. దీనితో రామ్ పోతినేని వీలైనంత త్వరగా బోయపాటి కాంబినేషన్ సెట్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు టాక్.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ పోతినేనికి మాస్ ఇమేజ్ బాగా పెరిగింది. ఆ ఇమేజ్ నిలబెట్టుకోవాలంటే బోయపాటి చిత్రం తనకు ఉపయోగపడుతుందని రామ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్' చిత్రంలో నటిస్తున్నాడు. రామ్, బోయపాటి చిత్రాన్ని కూడా అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.