పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపుదిద్దుకుంటుంది. రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడంతో భారీ రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ కూడా స్పందించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ అభిమానుల అంచనాలను రీచ్ కావడంతో పాటు మరింత హైప్ ని క్రియేట్ చేసింది. పదేళ్ల కింద పవన్ కళ్యాణ్ - హరి శంకర్ కాంబోలో బ్లాక్ బస్టర్ ఫిలిం గబ్బర్ సింగ్ వచ్చిన విషయం తెలిసింది. సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ కూడా తెలిసిందే. ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై తారస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
మూడేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన హరీష్ శంకర్ మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. మరో షెడ్యూల్ కు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మే 11న విడుదల చేసిన First Glimpse కు భారీ రెస్పాన్స్ దక్కుతుంది. గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గల్లా లుంగీ, ఖాకీ డ్రెస్, మాస్ స్వాగ్ తో ఇరగదీశారు. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. యూట్యూబ్లో #1లో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా మొత్తం గ్లిమ్స్ తోటే దుమ్ము లేస్తుంది. అయితే తాజాగా లింక గ్లిమ్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికన గ్లి పై రియాక్ట్ అయ్యారు.
ట్వీట్ చేస్తూ.. ‘పవన్ కళ్యాణ్ గారి మాసీ గ్లింప్స్ బాగా నచ్చింది. థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాను. ‘ఉస్తాద్ భగత్ సింగ్’టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట దుమ్ములేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 2 కోట్ల వ్యూస్ దక్కించుకుంది. గ్లింప్స్ కే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే మున్ముందు వచ్చే అప్డేట్స్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవ్వడం ఖాయమన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 2024లో రిలీజ్ కానుంది. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజికల్ బ్టాస్ తో థియేటర్లను బద్దలు చేయబోతున్నారని అర్థం అవుతోంది. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ లోకేషన్స్ సర్చింగ్ లో ఉన్నారు. ఇక రామ్ చరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 అనౌన్స్ చేయగా.. త్వరలో పూజా కార్యక్రామాలతోపాటు సెట్స్ మీదకు వెళ్లనుంది.
Loved this massy glimpse of garu ❤️ cannot wait to witness this massive entertainer in theatres 😊https://t.co/lgGxx1CX0z
Good luck to the entrie team of