బోయపాటికి రూ.15 కోట్ల రెమ్యునరేషన్!

By Udayavani DhuliFirst Published Dec 25, 2018, 1:58 PM IST
Highlights

మాస్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటికి తిరుగులేదు. ఆయనతో సినిమాలు చేసిన హీరోలందరికీ దాదాపు హిట్లనే ఇచ్చాడు బోయపాటి. 

మాస్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటికి తిరుగులేదు. ఆయనతో సినిమాలు చేసిన హీరోలందరికీ దాదాపు హిట్లనే ఇచ్చాడు బోయపాటి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాను రూపొందిస్తున్నాడు. 

జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత బోయపాటి.. బాలకృష్ణ హీరోగా సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో లాంచ్ లో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా బోయపాటి 'సింహా', 'లెజెండ్' లను మించి సినిమా ఉంటుందని అంచనాలను పెంచేశాడు.

ఈ సినిమా కథ బాలకృష్ణని ఎంతగా మెప్పించిందంటే.. రెమ్యునరేషన్ గా బోయపాటికి రూ.15 కోట్లు ఫిక్స్ చేశారట. ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడం బోయపాటికి ఇదే తొలిసారి.

స్టార్ హీరోలకు ధీటుగా బోయపాటికి రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. ప్రాజెక్ట్ పై ఎంత నమ్మకంగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలుకానుంది. మరి ఈ సినిమాతో బోయపాటి.. బాలయ్యకి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి!

click me!