ఎట్టకేలకు బాలయ్యతో సినిమా మొదలెట్టి, ఓ స్టేజికి తెచ్చాడు. ఉగాది రోజు టీజర్ వదిలి దుమ్ము రేపాడు.
బోయపాటి శ్రీను అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కత్తులు, కటార్లతో ఉగ్రరూపంలో ఊగిపోయే హీరో. చుట్టూ వందలమంది దాడికి సిద్దంగా ఉన్నా తమకు ఇచ్చిన పోర్షన్ డైలాగులు పూర్తి చేసే వినయం ఆ హోరోల సొంతం. అలాగే చంపటానికే పుట్టినట్లు విలన్స్ పై ఉవెత్తున దాడి చేస్తూ పాశవికంగా నరకడం బోయపాటి సినిమాలలో మెయిన్ హైలెట్స్ గా ఉంటాయి. బోయపాటి శ్రీను సినిమాలో ఎక్కువగా యాక్షన్ ని నమ్ముకుంటూ బీ, సీ సెంటర్స్ ను టార్గెట్ చేస్తాడు. ఆ ఫార్ములాతోనే మెగా హీరో రామ్ చరణ్ తో “వినయ విధేయ రామ” సినిమా చేసి మట్టికరిచాడు. దాంతో బోయపాటితో సినిమా చేయడానికి నిర్మాతలకు వెనకడుగు వేసారు. ఎట్టకేలకు బాలయ్యతో సినిమా మొదలెట్టి, ఓ స్టేజికి తెచ్చాడు. ఉగాది రోజు టీజర్ వదిలి దుమ్ము రేపాడు.
బాలయ్యతో చేస్తు్న ‘అఖండ’ టీజర్‌కు యూట్యూబ్‌లో ట్రెమెండెస్ రెస్పాన్స్ వస్తోంది. కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చే పంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగుతో ఈ సినిమా ఓ స్దాయిలో ఉంటుందని బోయపాటి చెప్పకనే చెప్పేసాడు.దాంతో అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమా టీజర్‌గా ‘అఖండ’ కొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ కర్ణాటకతో పాటు.. తెలంగాణలోని వికారాబాద్ అడవుల్లో షూట్ చేస్తున్నారు. ఇదంతా ప్రక్కన పెడితే బోయపాటి తన తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతున్నారనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
మీడియావర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు .. బోయపాటి శ్రీను .. బాలయ్యతో ‘అఖండ’ తర్వాత మరోసారి నందమూరి హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సారి నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఓ భారీ ఎడ్వంచర్ యాక్షన్ థ్రిల్లర్ ని రకెక్కించనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే కళ్యాణ్ రామ్‌కు కథ వినిపించిన బోయపాటి శ్రీను ప్రాజెక్టు ఓకే చేయించుకున్నారని చెప్తున్నారు. వరస ప్లాఫ్ ల్లో ఉన్న కళ్యాణ్ రామ్‌కు బోయపాటి శ్రీను పెద్ద హిట్ ఇస్తాడని భావిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాను బాలకృష్ణ సెట్ చేసాడంటున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నారు. ఇక బోయపాటి గత సినిమా ప్లాప్ అవ్వడంతో బోయపాటి రెమ్యూనరేషన్ సగంపైగా కోత విధించి ఫిక్స్ చేసాడట. అంటే త్వరలో కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా కనిపించనున్నారన్నమాట.