శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకి మరోసారి షాక్‌ ఇచ్చిన బాంబే హైకోర్ట్

By Aithagoni RajuFirst Published Aug 7, 2021, 1:41 PM IST
Highlights

 బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ రెండు సార్లు తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన 14 రోజుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా మరోసారి కోర్ట్ ని ఆశ్రయించారు.

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.  పోర్న్‌ వీడియో రాకెట్‌ ఆరోపణల నేపథ్యంలో గత నెల 19న ఆయన్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ని బాంబే హైకోర్ట్ రెండు సార్లు తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన 14 రోజుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా మరోసారి కోర్ట్ ని ఆశ్రయించారు. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, తనని వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ని శనివారం బాంబే హైకోర్ట్ కొట్టేసింది. 

బెయిల్‌ కోసం మూడో సారి చేసిన ప్రయత్నం కూడా విఫలమయ్యింది. దీంతో ఇప్పట్లో రాజ్‌కుంద్రా ఈ కేసు నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. అశ్లీల చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేయడం బాలీవుడ్‌ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. స్టోరేజ్‌ ఏరియా నెట్‌వర్క్‌ నుంచి 51 అడల్ట్‌ సినిమాలు, అతడి దగ్గర పని చేసే రాజ్‌, ర్యాన్‌ల ల్యాప్‌ట్యాప్స్‌లో 68 అశ్లీల చిత్రాలను పోలీసులు సేకరించారు. 

తన అరెస్ట్‌ను ముందే ఊహించిన రాజ్‌ కుంద్రా కొంతమేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక జూలై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆర్మ్స్‌ప్రైమ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ దర్శకుడు సౌరభ్‌ కుశ్వాహ, నటి షెర్లిన్‌ చోప్రాను సైతం పోలీసులు విచారించారు. అలాగే శిల్పాశెట్టిని కూడా పోలీసులు ప్రశ్నించగా, తనకు దీని గురించి ఏమీ తెలియదని, తాను అమాయకురాలిని అని పోలీసుల ముందు వాపోయింది. మరోవైపు మీడియా కథనాలు తమ పరువు తీసేలా ఉంటున్నాయని ఆమె కోర్ట్ ని ఆశ్రయించగా, కోర్ట్ ఆమె పిటిషన్‌ని తిరస్కరించిన విషయం తెలిసిందే.

click me!