అనారోగ్యంతో హిసార్ వాయిద్యకారుడు .. ఆదుకున్న సోనూసూద్

Published : Dec 01, 2022, 07:20 PM IST
అనారోగ్యంతో  హిసార్ వాయిద్యకారుడు .. ఆదుకున్న సోనూసూద్

సారాంశం

మరో సారి తన గొప్ప మనసు చాటుకున్నాడు రియల్ హీరో సోనూసూద్. చివరిదశలో.. దీనావస్తలో ఉన్న ఓ కళాకారుడిని కాపాడటానికి ముందుకు వచ్చాడు. ఎవరూ లేకున్నా.. నేనున్నాంటూ ముందుకు వచ్చాడు. 

కరోనా టైమ్ లో ఎంతో మందిని ఆదుకుని.. రియల్ హీరో, పేదలపాలిటి దేవుడు అని రకరకాల మన్ననలు పొందిన బాలీవుడ్ హీరో సోనూసూద్. కరోనా తరువాత కూడా ఆయన చాలా మందిని ఆదుకున్నాడు.  ఎంతో మందిని చదివించాడు. ఇలా చాలా వరకూ చాలా మందికి సాయం చేస్తూ.. రీల్ విల్ కాస్త రియల్ హీరో అయిపోయాడు సోనూ సూద్. ఈ క్రమంలో ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. 

బాలీవుడ్  నటుడు సోనూసూద్  చేసిన మంచి పనులు అన్నీ ఇన్నీ కావు. పేదల పాలిట దైవంగా మారిన ఈ స్టార్ యాక్టర్.. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న మర కళాకారుడికి అభయం ఇచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న హర్యానాకు చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83)కు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఎవరూ పట్టించుకోక.. అనాధలామారి..అనారోగ్యంతో బాధపడుతున్న మమన్‌ఖాన్ పరిస్థితిని వివరిస్తూ.. ఆయన ఫొటోను షేర్ చేశారు ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి . ట్విట్టర్‌లో ఈ విషయాన్ని  పోస్టు చేశారు. 

మమన్ ఖాన్ ఈ రోజు చనిపోయే స్థితిలో ఉన్నారని, ఎక్కడి నుంచీ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సాయం చేస్తారేమో అని ఈ పనిచేశాడు ఆ వ్యాక్తి. ఈక్రమంలోనే సోనూ సూద్ స్పందించారు. హర్యానాలోని హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన ఆయన హర్యానా ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పతకం, తామ్ర ఫలకం అందుకున్నారని ఇంద్రజిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. దాంతో ఈ పోస్ట్ అక్కడా.. ఇక్కాడా తిరుగుతూ.. ఆపద్భాందవుడు సోనూసూద్ దృష్టిలో పడింది. వెంటనే స్పందించిన ఆయన సాయానికి ముందుకొచ్చారు. 

వెంటనే స్పందించాడు సోనూసూద్ ఇంద్రజిత్ పోస్ట్ కు స్పందిస్తూ.. ఆన్సర్ కూడాఇచ్చాడు.. ఖాన్ సాబ్ ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా.. తర్వాత మీ సారంగి పాట వింటా అని సోనూసూద్ రీట్వీట్ చేశారు. అతనికి కావల్సిన వైధ్యం అందిస్తానన్నారుసోనూ.. సోనూ సూద్ స్పందించడం పట్ల... అంతటా హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఈ ట్వీట్ చేసిన ఇంద్రజిత్ .. సోనూ సాయానికి ఉప్పొంగిపోయాడు. తన ప్రయత్నం ఫలించినందకు ఎంతో సంతోషపడ్డాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్