అసలు విషయం రేపు చెపుతానంటున్న సల్మాన్ ఖాన్, వైరల్ అవుతున్న స్టార్ హీరో పోస్ట్..

సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు బాలీవుడ్ కండల వీరుడు.. సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఇంతకీ ఆయన ఎం పోస్ట్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు. 


60 ఏళ్లకు అతి దగ్గరగా ఉన్నా.. యంగ్ స్టార్స్ నుమించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాడు సల్మాన్ ఖాన్. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. అంతే కాదు వివాదాలు, కౌంటర్లు, సోషల్ మీడియా పోస్ట్ లలో కూడా ముందుంటాడు సల్మాన్ ఖాన్. ఈక్రమంలో ఆయన తాజాగా పెట్టినఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏమని పోస్ట్ పెట్టాడంటే..?   

కండలవీరుడు సల్మాన్‌ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం అవ‌స‌రం లేదు. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌కు సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది, ఈ ఫ్యాన్ బేస్ కి కారణం సల్మాన్‌ చేసిన సినిమాలు మాత్రమే కారణం కాదు సల్మాన్‌ మంచితనం కూడా. ఇక సల్మాన్‌ఖాన్ తాజాగా న‌టిస్తున్న చిత్రం టైగర్‌ 3 మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను అక్టోబర్‌ 16న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే.. తాజాగా సల్మాన్‌ఖాన్ సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

Latest Videos

 

I'll always have your back. pic.twitter.com/FRUl3hMZw7

— Salman Khan (@BeingSalmanKhan)

సల్మాన్‌ఖాన్ ట్విట్ట‌ర్‌లో ఒక అమ్మాయి వెనుక సైడ్ తిరిగి ఉండగా.. రేపు నా మనసులో ఒక భాగం మీతో పంచుకోబోతున్నాను. అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోకి నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను అని సల్మాన్‌ కాప్షన్ ఇచ్చాడు. అయితే ఈ ఫోటోలో ఉంది ఎవ‌రంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇది సినిమా ప్రమోషన్ లో భాగంగా పెట్టాడా లేక.. దీనికి ఏదైనా కారణం ఉందా.. అనేది తెలియాల్సి ఉంది. ఇక టైగర్ 3 మూవీ లో భాగంగా ఇలా చేసి ఉంటాడు అంటున్నారు ఫ్యాన్స్. 

click me!