హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్ విడివిడిగా 10 వేల వరకు టికెట్లు కొనడం ఆసక్తికరంగా మారింది.
రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారంలో రాబోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఐదు ప్రధాన భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సినిమాను భారీ ఎత్తున్న మేకర్స్ ప్రమోట్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ కు భారీ రెస్పాన్స్ దక్కింది.
ప్రస్తుతం Adipurushపై భారీ హైప్ నెలకొంది. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు హిందూ మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో ప్రతి భారతీయుడు చూడాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారింది. ప్రజలు ఆసక్తిగానే ఉన్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) ఆశ్యర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు.
‘ఆదిపురుష్’ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనని తనవంతుగా ఏకంగా 10 వేల టికెట్లు కొనుగోలు చేశారు. ఆ టికెట్లను పేద పిల్లల ఇవ్వనున్నారని, వారి హిందూ పురణాలపై అవగాహన కల్పించాలని భావించారని తెలుస్తోంది. హిందూ పురణాలను రన్బీర్ గౌరవించడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తెలుగు హీరో ప్రభాస్ రాముడిగా నటించినప్పటికీ బాలీవుడ్ స్టార్ రన్బీర్ కపూర్ ఇలా టికెట్లు కొనడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ కూడా మరో 10 వేల టికెట్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఆ టికెట్లను తెలంగాణలోని పిల్లలకు ఫ్రీగా ఇవ్వనున్నారని, అద్భుతమైన చిత్రాన్ని వెనుకబడిన పిల్లలు కూడా చూడాలని తనవంతు ప్రయత్నంగా ఇలా చేశారు. అంతటా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద ‘ఆదిపురుష్’ రికార్డు క్రియేట్ చేయబోతోందని అంటున్నారు. ఇప్పటికే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్ర రైట్స్ ను రూ.185 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. U సర్టిఫికెట్ పొందినట్టు వెల్లడించారు. సినిమా మొత్తం రెండు గంటల 59 నిమిషాలు నిడివిని కలిగి ఉందని తెలిపారు. సీతారాములుగా ప్రభాస్ (Prabhas) - కృతి సనన్ (Kriti Sanon) నటించగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్త హన్మంతుడిగా అలరించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ రావణసురుడి పాత్రను పోషించారు. జూన్ 16న ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
… RANBIR KAPOOR TO BOOK 10,000 TICKETS OF ‘ADIPURUSH’ FOR UNDERPRIVILEGED CHILDREN… OFFICIAL POSTER… pic.twitter.com/k30OUNvO9G
— taran adarsh (@taran_adarsh)