అమితాబచ్చన్ కు తీవ్ర అస్వస్థత, సర్జరీకోసం హాస్పిటల్లో చేరిన బిగ్ బీ..? ఆందోళణలో అభిమానులు..

By Mahesh Jujjuri  |  First Published Mar 15, 2024, 5:30 PM IST

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయనకు సర్జరీ కూడా చేయాల్సి ఉందని బాలీవుడ్ సమాచారం. ఇంతకీ అమితాబ్ కు ఏమయ్యింది. 


బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో..  బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు బాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆరోజు ఆయన హాస్పిటల్ లో  జాయిన్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఉదయం ముంబయిలోని కోకిలాబెన్‌ హాస్పిటల్ లో అయన అడ్మిట్ అయ్యినట్లు సమాచారం. 

అమితాబ్ కు ఏమయ్యిందో తెలియక ఫ్యాన్స్ ఆందోళణకు గురవుతున్నారు. కాగా బాలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం  బిగ్ బి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. దాంతో వెంటనే ఆయన్ను  హాస్పిటల్ కు తీసుకెళ్ళారట.  మరికొన్ని రిపోర్టులు చెబుతున్న విషయం ఏంటంటే.. కాలు సర్జరీ కోసం జాయిన్ అయ్యినట్లు చెబుతున్నాయి.

Latest Videos

అయితే అసలు బిగ్ బీకి ఏమయ్యింది.. హాస్పిటల్ లో చేరారా.. ఎందుకు అనేది మాత్రం అఫీషియలో గా కన్ ఫార్మ్ చేయలేదు. మరి ఈ వార్తలు ఏది నిజమో తెలియాలంటే అమితాబ్ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. ఇది ఇలా ఉంటే, మార్నింగ్ నుంచి ఈ వార్త వైరల్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో బిగ్ బి అభిమానులు కంగారు పడుతూ పోస్టులు వేశారు. 

ఇక ఈరోజు మధ్యాహ్న సమయంలో అమితాబ్ తన ఎక్స్‌(ట్విటర్‌)లో.. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన అభిమానులు.. అనారోగ్యం విషయం గానే అమితాబ్ ఈ ట్వీట్ చేసుంటారని భావిస్తున్నారు.


 

click me!