యష్ పై మనసు పారేసుకున్న కరీనా కపూర్, కెజియఫ్ స్టార్ కు జతగా బాలీవుడ్ బ్యూటీ..?

By Mahesh Jujjuri  |  First Published Nov 17, 2023, 1:41 PM IST

కన్నడ స్టార్ హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. కెజియఫ్ హీరోపై మనసు పారేసుకుంది బీ టౌన్ భామ. ఏంటుంటుందంటే..? 
 


బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా.. గ్లామర్ కూడా పెంచుకుంటూ.. వరుస అవకాశాలు సాధిస్తోంది సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్. దాదాపు 20 ఏళ్ళుగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసినటించింది కరీనా.. సైఫ్ తో పెళ్లి.. ఇద్దరు పిల్లల తరువాత కూడా ఆమె ఏమాత్రం తగ్గడంలేదు.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇక తాజాగా ఆమె ప్రముఖ నిర్మాత, దర్శకుడు  కరణ్‌ జోహార్‌ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్నది. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ తో కలిసి ఈ షోలో సందడి చేసింది కరీనా

కరణ్ షో అంటే మూమూలుగా ఉండదు కదా.. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలు బయటకు లాగేస్తాడు కరణ్ జోహార్. దాంతో ఈ షోకి వెళ్ళాలంటేనే చాలా మంది సెలబ్రిటీలు  భయపడుతుంటారు. ఇక కరీనా ఈ షోకి వెళ్లిన సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈక్రమంలో  కరణ్ జోహార్ కరీనాను కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడగడంతో పాటు, మరికొన్ని కోపం తెప్పించే ప్రశ్నలు కూడా వేశారు. అటు కరీనా కూడా కొన్నింటికి సమాధానం చెప్పగా, మరికొన్ని ప్రశ్నలను వదిలేసింది. 

Latest Videos

Sunny leone: సంప్రదాయ దుస్తుల్లో సన్నీలియోన్, షాక్ అవుతున్న నెటిజన్లు..

అయితే ఈ ప్రశ్నల్లో భాగంగా..  సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నావు? అని కరణ్ అడిగిన ప్రశ్నకు యశ్ అంటూ సమాధానం చెప్పింది. ఆయన నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని వెల్లడించింది. తను నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పింది. అవకాశం వస్తే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ వివరించింది.  అంతేకాదు తనను కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉందని మనసులో మాట బయట 

అంతే కాదు తన భర్త సైఫ్  అలీఖాన్‌ మొదటి భార్య కుమార్తే.. సారా అలీ ఖాన్ కు  తల్లిగా నటించే ఛాన్స్ వస్తే చేస్తావా అని కరణ్ ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తానని కరీనా వెల్లడించింది. తానుకొక నటినని, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటానని చెప్పింది. ఇక మరో ప్రశ్నకు కరీనాకు కోపం వచ్చింది. కరణ్ అడుగుతూ.. రీసెంట్ గా గదర్ 2 పార్టీకి ఎందుకు రాలేదు? అమీషాకు, నీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అని అడిగారు. వెంటనే కరీనాకు బాగా కోపం వచ్చింది. ఆ విషయం గురించి తాను మాట్లాడాలి అనుకోవడం లేదని చెప్పింది. 

ఆగలేకపోతున్న అట్లీ.. రజనీకాంత్ తో మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ర్..

కరణ్ జోహార్ అక్కడితో ఆగకుండా... ఆ విషయాన్ని రెట్టించాడు.. కహోనా ప్యార్ హ లో మీరే తొలి హీరోయిన్ కదా? అని మరో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కరీనా ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ అయ్యింది. ఒక్క సారి గతంలోకి వెళ్తే.. 2000లో రిలీజ్ అయిన కహోనా ప్యార్‌హై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆవిషయం  తెలిసిందే. అయితే ఆసినిమాలో ముందుగా కరీనా కపూర్ ను తీసుకున్నారు దర్శకుడు రాకేష్ రోషన్. ఆ తర్వాత అనుకోని గొడవల కారణంగా కరీనా ప్లేస్ లో అమీషా పటేను తీసుకున్నారు. దాంతో అప్పటి నుంచి వీరి మధ్య మాటలు లేవు.  ఈ విషయాన్ని గతంలో అమీషా  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందేకు కరణ్ ఆ ప్రశ్న వేయడంతో ఆమెకు కోపం గట్టిగానే వచ్చింది. 

click me!