అబుదబీలో అద్భుతం.. హాజరైన అక్షయ్ కుమార్, జన్మ ధన్యమైదన్న హీరో..

Published : Feb 15, 2024, 09:38 PM IST
అబుదబీలో అద్భుతం.. హాజరైన అక్షయ్ కుమార్, జన్మ ధన్యమైదన్న హీరో..

సారాంశం

ముస్లీం దేశంలో.. అద్భుతం ఆవిష్క్రుతం అయ్యింది. ఇండియాలో కూడా లేనంతగా అబుదబీలో హిందూ దేవాలయం రూపుదిద్దుకుంది. ఇక ఈ దేవాలయానికి తాజాగా సినిమా గ్లామర్ కూడా తోడయ్యింది. 

అబుదాబిలో అద్భఉతంగా మొదటి హిందూ దేవాలయం రూపుదిద్దుకుంది . ఈ దేవాలయాన్ని ఈనెల  14న  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆయనతో పాటు పలువురు ఇండియన్ సెలబ్రిటీలు  కూడా ఈ క్రతువులో భాగమయ్యారు. అందులో కాస్త సినిమా గ్లామర కూడా ఈ కార్యక్రమానికి తోడయ్యింది. బాలీవుడ్ నుంచి కొంత మంది తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. అందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. 

 బాలీవుడ్ సూపర్ స్టార్‌ అక్షయ్ కుమార్‌ ఈ అద్భుత ఘట్టంలో పాలు పంచుకున్నారు. అయితే ముస్లీమ్ దేశంలో సర్వమత సమ్మేళనంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో తొలిసారిగా హిందూ దేవాలయాన్ని నిర్మించడం పట్ల అక్షయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. అబుదాబిలోని స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు జన్మ ధన్యం అయ్యింది..ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ అబుదాబి హిందూ ఆలయ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అక్షయ్‌. అక్షయ్ ఇలా పోస్ట్ చేయడం.. ఇది  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

పోస్ట్ అయిన వెంటనే.. కొన్ని గంటల్లోనే  ఐదు లక్షల మందికి పైగా ఈ ఫోటోను లైక్ చేయడం విశేషం. ఈ ఫోటో గ్లాస్‌లో అక్షయ్ కుమార్ ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా 500 ఏళ్ల నుంచి హిందువులు  ఎదరు చస్తున్న అయోధ్య రామ మందిరం కూడా సాకారం అయ్యింది. లాస్ట్ మన్త్ లో అయోధ్య రామాలయం ప్రారంభం అవ్వగా.. వేల మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌