ఇండస్ట్రీలో విషాదం, బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య హఠాన్మరణం.

Published : Feb 15, 2024, 08:09 PM IST
ఇండస్ట్రీలో విషాదం, బాహుబలి ఆర్ఆర్ఆర్  సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య హఠాన్మరణం.

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఎప్పుడు ఎవరు కన్నుమూస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

టాలీవుడ్ లో స్టార్ సినిమాటోగ్రాఫర్ గా .. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్ట్ లకుపనిచేసిన సెంథిల్ కుమార్ ఇంటి తీవ్ర విపాదం చోటు చేసుకుంది. ఆయన భార్య రోహీ.. అనారోగ్యంతో బాధపడుతూ.. కన్నుమూశారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ సతీమణి యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. గతకొద్దికాలంగా ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యానికి గురైన ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈక్రమంలోనే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆమె తిరిగిరాని లోకాలకువెళ్లిపోయారు.  ఆమె మరణంతో సెంథిల్ కుమార్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. హాస్పిటల్ నుంచి రూహీ పార్థీవదేహాన్ని తమ నివాసానికి సెంథిల్ కుమార్ కుటుంబ సభ్యులు తరలించారు. ఆమె అంత్యక్రియులు శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరుగుతాయి అని పేర్కొన్నారు. 

ఇక సెంథిల్ కుమార్‌కు సతీ వియోగం కావడంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. కొంత మంది స్నేహితులు, సన్నిహితులు ఆయనన్ను ఫోన్ ద్వారా పరామర్శిస్తున్నారు. మరికొంత మంది ఇంటికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

MSG 26th Day Collections: `మన శంకర వర ప్రసాద్‌ గారు` ఓటీటీ డేట్‌.. చిరంజీవి సినిమా 26 రోజుల కలెక్షన్లు
Chandra Hass: జేడీ చక్రవర్తిది డబుల్‌ ఫేస్‌.. తిరగబడ్డ చంద్రహాస్‌.. పెద్ద సినిమాలను టార్గెట్‌ చేస్తూ కౌంటర్‌