Salim Ghouse Passes Away: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ నటుడు సలీం కన్నుమూత

Published : Apr 28, 2022, 06:14 PM IST
Salim Ghouse Passes Away: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, ప్రముఖ నటుడు సలీం కన్నుమూత

సారాంశం

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు సలీం గౌస్ కన్ను మూశారు. వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు సలీం.   

బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు సలీం గౌస్ 70 ఏళ్ళ వయస్సులో అనారోగ్యంతో ముంబయ్ లో కన్ను మూశారు. వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు సలీం. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సలీం తుది స్వాస విడిచారు. 

చాలా చిన్న వయస్సు నుంచే నటన పట్ల ఆకర్శితుడయ్యాడు సలీం, చాలా కష్టాలు పడి చిన్న చిన్న పాత్రలు వేయడం మొదలు పెట్టాడు. ఆ పాత్రలే అతన్ని మంచి నటుడిగా నిలబెట్టాయి. అక్కడ నుంచి లీడ్ క్యారెక్టర్స్ చేసే స్థాయికి ఎదిగాడు సలీం గౌస్. సలీం కు మంచి నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా బాలీవుడ్ లో పేరు ఉంది. అంతే కాదు ఆయనకు పెద్ద స్టార్స్ ఫిదా అయిపోయి ఫ్యాన్స్ గా మారిపోయారు. 

సలీం మృతితో బాలీవుడ్ లో విషాద చాయలు అలముకున్నాయి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింద పేరుగా నలిచిన సలీం మరణంతో సినీ ప్రముకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1952 జనవరి 10 చెన్నైలో జన్మించారు సలీం. నాటకరంగంలో అడుగులువేస్తూ.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ పెద్ద నటుడిగా ఎదిగారు. 

1978 లో సలీమ్ కు సినిమా అవకాశం లభించింది. స్వర్గ్ నరక్ సినిమాతో తన ఫిల్మ్ కెరీర్ ను స్టార్ట్ చేసిన సలీం. ఆతరువాత చక్ర, సారాంశ్, మోహన్ జోషీ హజీర్ హో లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాముడు, కృష్ణుడు, టిప్పు సుల్తాన్ లాంటి ఎన్నో ప్రముఖ పాత్రలు పోషించిన సలీం.. శ్యామ్ బెనగల్ లాంటి ఉద్దండులతో కూడా పనిచేశారు. 

ముఖ్యంగా సలీమ్ కు సుబా అనే టీవీ సీరయల్ వల్ల   బాగా పేరు వచ్చింది. ప్రతీ ఇల్లు ఆయనను ఆధరించింది. అటువంటి గొప్ప నటుడు మరణించడంతో ట్వీట్టర్ వేదికగా బాలీవుడ్ ప్రముఖులు సలీం కు నివాళీ అర్పిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్