రొమాన్స్ లో తగ్గేదెలే అంటోన్న శిరీష్‌.. బన్నీకి సర్‌ప్రైజ్‌

Published : May 29, 2021, 01:25 PM ISTUpdated : May 29, 2021, 01:43 PM IST
రొమాన్స్ లో తగ్గేదెలే అంటోన్న శిరీష్‌.. బన్నీకి సర్‌ప్రైజ్‌

సారాంశం

అల్లు హీరో శిరీష్‌ ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. 

అల్లు హీరో శిరీష్‌ రొమాన్స్ లో తగ్గేదెలే అంటున్నాడు. కొత్త సినిమాకి సంబంధించి వరుసగా ప్రీ లుక్‌లతో అదరగొడుతున్నారు. ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్‌ వైరల్‌గా మారింది. రెండు ప్రీలుక్స్ తో స‌రికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. `కొత్త జంట`‌, `శీర‌స్తు శుభ‌స్తు`, `ఏబిసిడి` వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో `ఒక్క క్ష‌ణం` వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, 

ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో `100% ల‌వ్`, `భలే భ‌లే మ‌గాడివోయ్`, `గీత‌గోవిందం`, `ప్ర‌తిరోజూపండుగే` వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నాను. 

ఈ వివ‌రాల‌ను తెలుపుతూ, ఇటీవ‌లే చేసిన ప్రీ లుక్ పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయింది. ఇదే ఉత్సాహాంతో తాజాగా మ‌రో ప్రీలుక్ ని విడుద‌ల చేసి సరికొత్త ట్రెండ్ కి అల్లు శిరీష్ నాంధి ప‌లికారు.  అల్లు శిరీష్, అను ఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ ఇంటెన్స్ స్టిల్ తో  సిద్ధం చేసి విడుద‌ల చేసిన ఈ ప్రీలుక్ 2 ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో మే 30న విడుద‌ల కాబోతున్న‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని మే 30న అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే ఐకాన్‌ స్టార్‌, అన్నయ్య అల్లు అర్జున్ కి గిఫ్ట్ ఇచ్చాడు శిరీస్‌. ఈ విషయాన్ని బన్నీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?