బోరుమని ఏడ్చిన నోరా ఫతేహీ, బాలీవుడ్ బ్యూటీకి ఏమయ్యింది..?

By Mahesh Jujjuri  |  First Published Feb 18, 2024, 2:07 PM IST

బోరున ఏడ్చిందట బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి. ఆమె అంతలా ఎందుకు ఏడ్చింది..? ఆ సందర్భం ఎందుకు వచ్చింది..? ఎవరు ఆమెను ఏడ్పించారు..? 
 



బాలీవుడ్ హీరోయిన్ నోరాఫతేహీ బోరున ఏడ్చిందట. అవును ఎంత ఆపుకోవాలి అనుకున్నా ఆమెకు ఏడుపు ఆగలేద. ఓ సినిమా సెట్ లో అందరూ చూస్తుండగానే ఆమె బోరున ఏడ్చేసిందట. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చిందంటే.. షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాధమే ఆమె ఏడుపుకు కారణం. అవును బాలీవుడ్ మూవీలో జరిగిన ప్రమాదం కారణంగా ఆమెకు ఏడుపు ఆగలేదంటంది. వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి రీసెంట్ గా  ఓ భారీ  ప్రమాదం నుంచి బయటపడింది. బాలీవుడ్ కండల వీరుడు విద్యుత్‌ జామ్వాల్ కు జంటగా నోరా  ఓ మూవీలో నటిస్తోంది. క్రాక్‌ టైటిల్ తో  రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే   సినిమా షూటింగ్‌లో ఓ ప్రమాధ  సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.  ఈ ప్రమాదం వల్ల తాను గాయపడినట్టు ఆమె చెప్పుకొచ్చింది. 

Latest Videos

ఓ యాక్షన్‌ సన్నివేశంలో రోప్‌ వల్ల ఆమెకు గాయాలయ్యాయి. ‘అప్పుడేం జరిగిందో నాకు అర్థం కాలేదు. రోప్‌ గట్టిగా చుట్టుకుంది. బ్యాలెన్స్‌ కోల్పోయి నేను వెనక్కి పడిపోయాను.రోలర్‌ బ్లేడ్స్‌ ముందుకు కదలడం వల్ల గాయం పెద్దదే అయింది. ఆ క్షణం ఏమైపోతుందో అని భయపడ్డా’ అని ఆనాటి సంగతిని పంచుకుంది నోరా.  ఆ గాయం ఇప్పటికీ మర్చిపోలేనిదంటోంది నోరా. అంతే కాదు అప్పుటి మరో సంఘటనను కూడా పంచుకుంది బ్యూటీ. 

ఈ ప్రమాదం తర్వాత షూటింగ్‌ స్పాట్‌లో గంభీరంగా ఉండటానికి ప్రయత్నించాను.. కాని నావల్ల కాలేదు..  కాసేపటికి చిన్నపిల్లలా భోరున ఏడ్చేశాను అని అప్పటి  అని గుర్తు చేసుకుంది. ఆదిత్య దత్‌ దర్శకత్వంలోని ‘క్రాక్‌’ ఈనెల 23న విడుదల నుంది.

click me!