మరో అమ్మాయితో ఎఫైర్... పబ్లిక్ లో ప్రియుడితో గొడవపడ్డ బిగ్ బాస్ ప్రియాంక!

By Sambi Reddy  |  First Published Feb 18, 2024, 12:21 PM IST

ప్రియాంక జైన్ సీరియల్ నటుడు శివ కుమార్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే శివ కుమార్ కి అమెరికాలో మరో గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిన ప్రియాంక సింగ్ పబ్లిక్ లో గొడవ పడింది. 
 


సీరియల్ నటి ప్రియాంక జైన్   బిగ్ బాస్ షో వేదికగా మరింత పాప్యులర్ అయ్యారు. గతంలో ప్రియాంక మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో లీడ్ హీరోయిన్ గా చేసింది. మౌనరాగంలో ఆమెకు జంటగా నటించిన శివ కుమార్ ని ప్రియాంక  ప్రేమించింది. ఈ విషయం బిగ్ బాస్ షో వేదికగా బయటపెట్టింది. హోస్ట్ నాగార్జున మీ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలి అనగా... సిగ్గు పడుతూ శివ కుమార్ పేరు చెప్పింది. 

ఇక ఫ్యామిలీ వీక్ లో ప్రియాంక  కోసం శివ కుమార్ రావడం కోసం మెరుపు. హౌస్లో కెమెరా ల ముందే ఇద్దరు రొమాన్స్ చేశారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. హౌస్లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక ప్రియుడు శివ కుమార్ ని కోరింది. బయటకు వచ్చాక పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. అయితే వీరు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం పై విమర్శలు వినిపించాయి. 

Latest Videos

పెళ్లి చేసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ ప్రియాంక గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. అందుకే లేట్ అవుతుందని శివ కుమార్ వివరణ ఇచ్చాడు. కాగా వీరిద్దరూ పబ్లిక్ లో గొడవ పడ్డారు. శివ కుమార్ తనకు అమెరికాలో గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పడంతో ప్రియాంక ఫైర్ అయ్యింది. ఇద్దరూ ఓ షాపింగ్ మాల్ కి వెళ్లారు. త్వరలో నేను అమెరికా వెళుతున్నాను. అక్కడ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె కోసం చీర కొనాలి అన్నాడు. 

ఏం మాట్లాడుతున్నావ్... ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు నాకు తెలియాలి అని ప్రియాంక సీరియస్ అయ్యింది. శివ కుమార్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. అయినా ప్రియాంక వినలేదు. దాంతో పబ్లిక్ లో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఇదంతా జస్ట్ ఫ్రాంక్. గతంలో కూడా ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్ లో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు చేసింది. 
 

click me!