యంగ్‌ హీరోపై విరుచుకుపడ్డ కంగనా.. రియాకి మద్దతుపై కామెంట్‌!

Published : Aug 10, 2020, 03:31 PM IST
యంగ్‌ హీరోపై విరుచుకుపడ్డ కంగనా.. రియాకి మద్దతుపై కామెంట్‌!

సారాంశం

తాజాగా యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా.. కంగనాకి దొరికిపోయాడు. దీంతో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయింది. నెపోటిజానికి మద్దతిస్తున్నావని విమర్శించింది. సుశాంత్‌ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఆయుష్మాన్‌ ఖురానా పలు వ్యాఖ్యలు చేశారు.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ప్రధానంగా నెపోటిజం వాదన చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఈ చర్చకు శ్రీకారం చుట్టింది. నెపోటిజంపై ఆమె ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతుంది. చిన్నా, పెద్ద లేకుండా వాయించేస్తుంది. ఆ మధ్య కరణ్‌ జోహార్‌కి మద్దతుగా నిలిచిన తాప్సీ ఓ ఆట ఆడుకుంది. 

తాజాగా యంగ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా.. కంగనాకి దొరికిపోయాడు. దీంతో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయింది. నెపోటిజానికి మద్దతిస్తున్నావని విమర్శించింది. సుశాంత్‌ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఆయుష్మాన్‌ ఖురానా పలు వ్యాఖ్యలు చేశారు. ఆమెపై సానుభూతి చూపించాడు. ఇదే కంగనాకి మండేలా చేసింది. దీంతో తన దైన స్టయిల్‌లో విరుచుకుపడింది. `చప్లాస్‌ ఔట్‌ సైడర్‌` అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌లో మనుగడ సాధించాలనే ఉద్దేశ్యంతో ఆయుష్మాన్‌ నెపోటిజానికి, వారసత్వానికి మద్దతు ఇస్తున్నాడని వెల్లడించింది. బాలీవుడ్‌ మాఫియాకి మద్దతు ఇస్తున్నారంటే కచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం పొందుతున్నారని అర్థమవుతుందని తెలిపింది. నెపోటిజంపై మాట్లాడుతున్నందుకు తనకు కొందరు మద్దతు ఇస్తున్నారని, మరికొందరు విమర్శిస్తున్నారని, ఈ నేపథ్యంలో విమర్శించే వారి మద్దతు పొందేందుకు ఆయుష్మాన్‌ ట్రై చేస్తున్నారని తెలిపింది. ఈసందర్భంగా కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేసింది. 

అందులో మూడు విషయాలను పేర్కొన్నారు. ఒకటి ఆయుష్మాన్‌ ఖురానా.. బాలీవుడ్‌లో మనుగడ సాధించేందుకు, రెండు అతను యష్‌రాజ్‌ ఫిల్మ్స్ కి చెందిన వ్యక్తి కావడం, మూడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తనకు పోటీదారుగా భావించడం అంటూ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడిది మరో దుమారాన్ని రేపుతుంది. మరోవైపు సుశాంత్‌ కేసు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అటు దిశా మరణం కూడా అనేక టర్న్‌లు తీసుకుంటుంది. దీంతోపాటు రియాని ఈడీ విచారిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి