సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రానా - మిహికాల పెళ్లి ఫోటోలు

Published : Aug 10, 2020, 03:08 PM IST
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రానా - మిహికాల పెళ్లి ఫోటోలు

సారాంశం

ప్రేమజంట రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ముఖ్యంగా ముచ్చటైన రానా-మిహికా జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజెన్స్ రానా-మిహికా జంట అధ్బుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 
ఇక రానా వైట్ కలర్ ధోతి, కుర్తా సెట్ ధరించాడు.  ఖరీదైన బట్టలలో రానా-మిహికా జంట అధ్బుతంగా ఉన్నారు. ఇక ఈ పెళ్లి వేడుక ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లి ఫొటోలలో రానా-మిహికా బజాజ్ జంటను చూసిన నెటిజెన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. లైక్స్ మరియు షేర్స్ తో వైరల్ చేస్తున్నారు. వీరి పెళ్లి జరిగి రెండు రోజులు అవుతున్నా సోషల్ మీడియాలో సందడి అసలు తగ్గలేదు. 
 
ఇక కోరుకున్న ప్రేయసిని భార్యగా చేసుకున్న రానా, అనేక మూవీ షూటింగ్స్ పూర్తి చేయాల్సివుంది. తెలుగులో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో చేస్తున్న విరాట పర్వం మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే దర్శకుడు గుణశేఖర్ హిరణ్యకశ్యప పేరుతో రానా తో ఓ భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కించనున్నారు. ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఓ తమిళ చిత్రంలో నటించాల్సివుండగా, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి