ఆ డైరెక్టర్ ని  అరెస్ట్ చేయండి...గవర్నర్ ని కలిసిన హీరోయిన్

Published : Sep 30, 2020, 02:54 PM IST
ఆ డైరెక్టర్ ని  అరెస్ట్ చేయండి...గవర్నర్ ని కలిసిన హీరోయిన్

సారాంశం

దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని అరెస్ట్ చేయాలని గవర్నర్ కలిశారు బాలీవుడ్ హీరోయిన్. తనపై లైంగిక దాడికి పాల్పడిన అనురాగ్ పై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.   

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ ఒకరు అనురాగ్ తనపై లైంగిక దాడి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో బాలీవుడ్ లో కొందరు అనురాగ్ కి మద్దతు తెలుపగా మరి కొందరు సదరు హీరోయిన్ కి  సపోర్ట్ చేయడం జరిగింది. అనురాగ్ మాజీ భార్యలు సైతం ఆయన ఉన్నతమైన వ్యక్తిగా చెప్పారు. 

అనురాగ్ పై కేసు పెట్టినప్పటికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం ఆ హీరోయిన్ చేశారు. అనురాగ్ ని అరెస్ట్ చేయాలంటూ మహారాష్ట్ర గవర్నర్ ని ఆమె కలవడం హాట్ టాపిక్ గా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన అనురాగ్ ని అరెస్ట్ చేయాలని గవర్నర్ కి అభ్యర్ధన చేసినట్లు తెలుస్తుంది.

తనపై లైంగిక దాడికి తెగబడిన అనురాగ్ ని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్  చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్ డిమాండ్ పై గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.  ఇప్పటికే కంగనా ఆరోపణలు బాలీవుడ్ ని షేక్ చేస్తుండగా ఈ హీరోయిన్ ఆరోపణలు కొత్త వివాదానికి తెరలేపాయి. 

ఇక బాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపికా పదుకొనె బీజేపీ ప్రభుత్వం పై పరోక్షంగా ఆరోపణలు చేశారు.  ఖచ్చితంగా రాహుల్ పీఎం అవుతారని ఆమె చెప్పడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!