తెలుగు ఆడియన్స్ పై షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

Published : Dec 20, 2022, 12:38 PM IST
తెలుగు ఆడియన్స్ పై  షారుక్ ఖాన్ షాకింగ్  కామెంట్స్  వైరల్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

సారాంశం

ట్విట్టర్ లోమ  అభిమానులతో ముచ్చటించారు షారుఖ్ ఖాన్.. ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని, సౌత్ సినిమాను తక్కువగాచూసిన వారే.. మన సినిమా గురించి..మన ఆడియన్స్ గురించి గొప్పగా మాట్లాడకతప్పడంలేదు. ఇక తెలుగు ఆడియన్స్ గురించి షారుఖ్ ఏమన్నారంటే..?   

తెలుగు ఫ్యాన్స్ గురించి చెప్పండి అంటూ ఓ నెటిజన్ అడగ్గా..బాద్ షా స్పందిస్తూ.. తెలుగు ఆడియన్స్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారని.. వారికి మంచి సినిమా పరిజ్ఞానం ఉందంటూ కామెంట్ చేశారు. దీంతో షారుఖ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ గురించి షారుఖ్ చేసిన కామెంట్స్ పై ప్ర శంసలు కురిపిస్తున్నారు సౌత్ నెటిజన్స్.


ఒకప్పుడు తెలుగు సినిమాన్నా.. తెలుగు ఆర్టిస్ట్ లు అన్నా చిన్న చూపు ఉండేది. ముఖ్యంగా బాలీవుడ్ ల మనవాళ్ళపై రకరకాల కామెంట్లు చేసిన వారు చాలా మంది ఉన్నారు. కాని ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బాలీవుడ్ ను దాటి.. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగింది. అఫ్ కోర్స్ ఈ క్రెడిట్ అంటూ ఇవ్వాల్సి వస్తే.. అది రాజమౌళికే దక్కుతుంది. టాలీవుడ్ స్థాయి మారిపోయే సరికి.. బాలీవుడ్ ఆ విషయాన్ని జీర్ణిచుకోలేక పోతోంది. ఇక తప్పక తెలుగు వారిని పొగడాల్సి వస్తోంది. ఈ విషయంలో పాపం షారుఖ్ ఖాన్ కు కూడా ఇబ్బంది తప్పలేదు.

ఒకప్పుడు షారుఖ్ తో సహా.. చాలా మంతి హీరోలు సౌత్ సినిమాపై శీతకన్ను వేసినవారే. ఇప్పుడు మన ఇండస్ట్రీ లేకపోతే.. వారికి మనుగడ లేని పరిస్థితి. ఇక రీసెంట్ గా తెలుగు ఆడియన్స్ పై షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. దాదాపు నాలుగేళ్లకు పైగా రకరకాల కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన షారుఖ్ ఖాన్..  ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో  బిజీగా ఉన్నారు. సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నారు బాలీవుడ్ బాద్ షా.

వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది పఠాన్ మూవీ. లేని పోని తలనొప్పులు తప్పలేదు షారుఖ్ కు. ఈక్రమంలో తెలుగువారి నుంచి ఆయన సినిమాలకు మంచి సపోర్ట్ లభిస్తుండటంతో.. తెలుగు ఆడియన్స్ పై షారుఖ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో లైవ్ లో ముచ్చటించారు షారుఖ్. ఈ క్రమంలోనే తెలుగు ఆడియన్స్ గురించి  ఓ ప్రశ్న ఎదురయ్యింది షారుఖ్ కు. తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ గురించి మీ  అభిప్రాయం ఏంటీ..?  చెప్పండి అంటూ ఓ నెటిజన్ అడగ్గా..బాద్ షా స్పందిస్తూ.. తెలుగు ఆడియన్స్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారని.. వారికి మంచి సినిమా పరిజ్ఞానం ఉందంటూ కామెంట్ చేశారు. 

 

దీంతో షారుఖ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తెలుగు ఆడియన్స్ గురించి షారుఖ్ చేసిన కామెంట్స్ పై ప్ర శంసలు కురిపిస్తున్నారు సౌత్ నెటిజన్స్. గతంలో మనవారిని లెక్క చేయని షారుఖ్ కు ఇప్పుడు మన తెలుగు ఆడియన్స్ హిట్ తెచ్చిపెట్టేలా ఉన్నారు. మన స్టార్లు కూడా నార్త్ ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక పఠాన్ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు షారుఖ్. వివాదాల సుడిగుండంల్ చిక్కుుని ఉన్నారు. 

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. దాంత ఈమూవీ కోసం సౌత్ నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు షారుఖ్ పఠాన్ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే అనూహ్యంగా పఠాన్ మూవీ రకరకాల వివాదాల్లో చిక్కుకుంటుంది. అసలు ముందు నుంచి ఈ సినిమాకు బైకాట్ సెగ తగులుతున్నా..ఏదోలా నెట్టుకొస్తుంది మూవీ టీమ్.  ప్రమోషన్స్ కూడా షూరు చేసింది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదం సైతం నెట్టింట వైరలవుతుంది. ఈ పాటలో ఓవర్ రొమాన్స్ కారణంగా షారుఖ్ ట్రోల్స కు గురయ్యారు. సామాన్యులేకాదు.. సెలబ్రెటీలు సైతం ఈ పాటను విమర్శిస్తున్నారు. దీంతో బేషరమ్ రంగ్ సాంగ్ వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?