Balakrishna: నాగార్జునకు షాక్...  బిగ్ బాస్ 7 హోస్ట్ గా బాలకృష్ణ? 

Published : Dec 20, 2022, 12:37 PM ISTUpdated : Dec 20, 2022, 12:46 PM IST
Balakrishna: నాగార్జునకు షాక్...  బిగ్ బాస్ 7 హోస్ట్ గా బాలకృష్ణ? 

సారాంశం

 వరుసగా నాలుగు బిగ్ బాస్ సీజన్స్ కి నాగార్జున హోస్టింగ్ చేశారు. లేటెస్ట్ సీజన్ ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ సీజన్ కి కొత్త హోస్ట్ వస్తారని ప్రచారం జరుగుతుండగా, అది బాలయ్య అన్న ప్రచారం మొదలైంది.   

బిగ్ బాస్ తెలుగు 6 ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. శ్రీహాన్-రేవంత్ ఫైనల్ లో టైటిల్ కోసం పోటీపడ్డారు. అయితే శ్రీహాన్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ రేవంత్ విన్నర్ అయ్యాడు. శ్రీహాన్ రూ. 40 లక్షల ఆఫర్ అంగీకరించకపోతే విన్నర్ గా అవతరించేవాడు. అతడు తప్పుడు నిర్ణయం వలన తృటిలో టైటిల్ కోల్పోయాడు. 

ఇక బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) నిరాదరణకు గురైంది. సీజన్ మొత్తం పూర్ టీఆర్పీ వచ్చింది. హోస్ట్ నాగార్జున సందడి చేసే వీకెండ్స్ లో కూడా రేటింగ్ మెరుగు కావడం లేదు. అలాగే నాగార్జున(Nagarjuna) హోస్టింగ్ తీవ్ర విమర్శలపాలైంది. ఆయన గేమ్ చూడకుండానే కంటెస్టెంట్స్ పెర్ఫార్మన్స్ రివ్యూ చేశాడని కొందరి భావన. పెద్ద తప్పులు చేసిన కంటెస్టెంట్స్ ని పొగడటం, మైనర్ మిస్టేక్స్ చేసిన కంటెస్టెంట్స్ పై విరుచుకు పడటం చేశారు. రేవంత్ వంటి కంటెస్టెంట్స్ కి అనుకూలంగా సాగిన ఆయన హోస్టింగ్ పక్షపాత వైఖరి కలిగి ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ బాధ్యతలు ఆయనకు అప్పగించడం లేదని సమాచారం. ఎఫెక్టివ్ గా ఈ జాబ్ చేసే మరో స్టార్ కోసం మేకర్స్ వెతుకుతున్నారట. ఈ క్రమంలో బాలకృష్ణ బెస్ట్ ఛాయిస్ అనుకుంటున్నారట. అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలకృష్ణ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆ టాక్ షోని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. హోస్ట్ గా అన్ స్టాపబుల్ షోలో ఆయన మాటతీరు, బాడీ లాంగ్వేజ్ చూసిన నిర్వాహకులు బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారట. 

బాలయ్యను(Balakrishna) బిగ్ బాస్ సీజన్ 7 హోస్ట్ గా ఒప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారట. బాలయ్య ఒప్పుకుంటే తమ షో సగం సక్సెస్ అయినట్లే అని మేకర్స్ నమ్ముతున్నారట. మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. అలాగే ఆయన దర్శకుడు అనిల్ రావిపూడితో 108వ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ramayana Movie: రూ.4000 కోట్ల 'రామాయణం' అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.. వరల్డ్ వైడ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే?
Pedarayudu Movie Review: చిరంజీవిని చావు దెబ్బకొట్టిన మోహన్ బాబు సినిమా, పెదరాయుడు రివ్యూ..