సల్మాన్ ఖాన్ కు డెంగీ ఫీవర్.. ఆందోళనలో అభిమానులు, బిగ్ బాస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో...?

Published : Oct 22, 2022, 07:40 PM ISTUpdated : Oct 22, 2022, 07:42 PM IST
సల్మాన్ ఖాన్ కు డెంగీ ఫీవర్.. ఆందోళనలో అభిమానులు, బిగ్ బాస్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో...?

సారాంశం

బాలీవుడ్   స్టార్ హీరో.. కండల వీరుడు  సల్మాన్ ఖాన్ గత కొన్నిరోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. దాంతో షూటింగ్స్ అన్నింటికి విరామం ప్రకటించి సల్మాన్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.  

అనారోగ్యం కారణంగా సల్మాన్ ఖాన్ ఆయన చేస్తున్న సినిమాల  షూటింగ్స్ అన్నింటికి విరామం ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇంటి దగ్గరే ఉంటూ.. ఆయన ఫ్యామిలీ డాక్టర్ తో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది.  అంతే కాదు బిగ్ బాస్ సీజన్ 16 కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా తప్పకున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్  కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్  నెల 25 నుంచి తాజా షెడ్యూల్ జరుపుకోనుంది అయితేు ఈ షూటింగ్ లో సల్లుూ భాయ్  పాల్గొననున్నట్టు సమాచారం. . ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించగా, సల్మాన్ కు సడెన్ గా డెంగీ ఫీవర్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతుండటం.  సల్మాన్ ఖాన్ తన ఆరోగ్యం విషయంలో  బెటర్ ఫీల్ అవుతుండటంతో  మూవీ షూటింగ్ పై ఆయన దృష్టి పెట్టారట. 

అంతే కాదు సల్మాన్ ఖాన్ ప్రతీ సారి దివాళికి ఏదో ఒక సందడి చస్తుంటారు. కాని ఈసారి ఆయన  అనారోగ్యం కారణంగా సల్మాన్ ఖాన్ ఈసారి దీపావళి పార్టీలకు కూడా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే ఆయన అభిమానులు మాత్రం సల్మాన్ ఆరోగ్యం పై కలవర పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యం పై రకరకాల వార్తలు వస్తున్నాయి. సల్మాన్ కండీషన్ బాగోలేదని. కాస్త క్రిటికల్ గా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. 

సల్మాన్ పరిస్థితి బాగోలేదని.. దాంతో మీడియా తో పాటు అభిమానులకు కూడా  ఈ విషయం తెలియకుండా దాచేస్తున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి అంతేకాదు ప్రజెంట్ ఆయన ఐసీయూ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఈసారి బిగ్ బాస్ విషయంలో  హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ ను  నియమించినట్లు సమాచారం.  దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిస్తున్నారు.

ఇప్పటికే 16వ సీజన్ బిగ్ బాస్ ప్రకటన వచ్చేసింది.. అన్ని సీజన్స్  సల్మాన్ ఖాన్  హోస్ట్ చేయగా.. ఫస్ట్ టైమ్  బిగ్ బాస్ 16కి హోస్టుగా కరణ్ జోహార్ చేయబోతున్నాడు.ఈ విషయాని అఫీషియల్ గా ప్రకటించింది హిందీ బిగ్ బాస్ టీం.డెంగ్యూ వ్యాధి వల్ల  సల్మాన్ ఖాన్ బాగా డల్ అయ్యాడట. మరి ఆయన ఎప్పుడు కోలుకుంటారో చూడాలి. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ