స్టార్ హీరో చేతుల్లోకి 'సైరా నరసింహారెడ్డి'!

Siva Kodati |  
Published : May 27, 2019, 03:49 PM IST
స్టార్ హీరో చేతుల్లోకి 'సైరా నరసింహారెడ్డి'!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రని ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు, తమన్నా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

సైరా చిత్రం ప్రస్తుతం చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్టోబర్ ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్ర బిజినెస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సైరా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్ర హిందీ హిందీ హక్కులని స్టార్ హీరో ఫరాన్ అక్తర్ దక్కించుకున్నారు. ఫరాన్ అక్తర్ కు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ సైరా హిందీ హక్కులని భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఉండడం హిందీ వర్షన్ కు కలసి వచ్చే అంశం. తాజాగా ఫరాన్ అక్తర్ కూడా సైరా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇక హిందీలో సైరా చిత్ర పబ్లిసిటీకి డోకా లేదని అంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?