
ముంబై- బాలీవుడ్ నటీమణి, బీజేపీ ఎంపీ హేమామాలిని వ్యక్తిగత సామాన్లు భద్రపరుచుకునే ఓ గోడౌన్ లో దొంగలు పడ్డారు. ఈ కేసుకు సంబంధించి హేమ ఇంటి పనిమనిషిని అనుమానితునిగా భావించి అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు.
కాగా.. పనిమనిషి నుంచి గత ఐదారు రోజులుగా ఎలాంటి కాంటాక్ట్ లేకపోవడం, హేమ మేనేజర్ ముంబై అంధేరిలోని డి.ఎన్.నగర్ లో వున్న గొడౌన్ ను చూసి దొంగతనం జరిగినట్లు చెప్పడంతో మంగళవారం ఈ చోరీ గురించి తెలిసిందని చెప్పారు. ఇక చోరీలో పోయిన వస్తువుల్లో కొన్ని సంగీత వాయిద్య పరికరాలు, ఖరీదైన దుస్తులు, ఖరీదైన గిల్టు నగలతో పాటు హేమ సినిమా షూటింగ్స్ కోసం వాడే లక్ష రూపాయల విలువైన ఇతర సామాగ్రి కూడా చోరీకి గురైనట్లు వెల్లడించారు.
ఇక ఆ గది పరిసరాలను కాపలా కాసే వ్యక్తే ఈపని చేశాడనే అనుమానం వుందంటూ ఫిర్యాదు అందటంతో ఈ ఘటనపై జూహు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ డి.బర్గుడే తెలిపారు.
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, డాన్సర్ హేమామాలిని యుపిలోని మథుర నియోజకవర్గం నుంచి ఏంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్టోబర్ 16న హేమామాలిని 69వ పుట్టినరోజు. గతంలో 201లో కూడా గోరెగాంలోని తన ఇంట్లో రూ.80లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు, పనిమనిషి హత్తం వుందనే అనుమానాలున్నాయంటూ హేమామాలిని ఫిర్యాదు చేసారు.